ఇండోర్:రైజింగ్ పూణే సూపర్ జెయింట్ తమ ముందు ఉంచిన 164 పరుగల లక్ష్యాన్ని ఛేదించి క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 27 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వోహ్రా 14 పరుగులు చేసి దిండా బౌలింగులో అవుటయ్యాడు.
ఐపీల్ తాజా సీజన్ లో శనివారం పంజాబ్- రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్లు తలపడనున్నాయి. పంజాబ్ హోం గ్రౌండ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీఐజీ హరినారాయణచారి మిశ్రా తెలిపారు.
మొత్తం 1600మంది భద్రతా సిబ్బందితో మైదానం వద్ద భద్రతను ఏర్పాటు చేసినట్లు డీఐజీ చెప్పారు. వీరితో పాటు 8మంది ఐపీఎస్ అధికారులు కూడా విధుల్లో ఉంటారని, ఈ మ్యాచ్ కోసం మూడంచెల భద్రత కల్పిస్తామని తెలియజేశారు. అలాగే మైదానంలో ప్రతీ కదలికను నిరంతరం పర్యవేక్షించేలా 70సీసీటీవి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. బ్లాక్ లేదా నకిలీ టికెట్లతో మ్యాచ్ కు హాజరయ్యేవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇక ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. గ్లెన్ మాక్స్ వెల్, డేవిడ్ మిల్లర్, షాన్ మార్ష్ వంటి హార్డ్ హిట్టర్స్, మిచెల్ జాన్సన్ వంటి ఫాస్ట్ బౌలర్ ఉండటం పంజాబ్ జట్టుకు కలిసొచ్చే అంశం. హార్డ్ హిట్టర్స్ లో ఏ ఒక్కరూ రెచ్చిపోయిన స్కోరు బోర్డుపై టార్గెట్ పరుగులు పెట్టడం ఖాయం. పంజాబ్ కు మెంటర్ గా సీనియర్ క్రికెటర్ సెహ్వాగ్ వ్యవహరిస్తుండటం అదనంగా కలిసొచ్చే అంశం.
అదే సమయంలో పుణే జెయింట్స్ కు తిషారా పెరీరా లాంటి ఆల్ రౌండర్, అజింక్యా రహానే వంటి క్లాస్ బ్యాట్స్ మెన్, స్మిత్, ధోని లాంటి హార్డ్ హిట్టర్స్ ఆ జట్టులో ఉన్నారు. పైగా ఆడిన తొలి మ్యాచులో బోణి కొట్టి ఆ జట్టు మంచి ఊపు మీద ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఈరోజు సాయంత్రం 4గం.కు జరగబోయే మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.