రాజ్‌కోట్: ఐపీఎల్‌లో ఈ రోజు (శుక్రవారం) మూడో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. తొలుత గుజరాత్ 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. దీనిని కోల్‌కతా సులభంగా చేధించింది. ఓపెనర్లు (లిన్ -గంభీర్)లు ఇద్దరే 184 పరుగులు చేసి, కోల్‌కతాను గెలిపించారు.
గెలిచేందుకు 15 ఓవర్లు కూడా ఆడలేదు. ఇరు జట్లు గత ఏడాది రెండుసార్లు తలపడ్డాయి. ఆ రెండుసార్లు గుజరాత్ గెలిచింది. ఈసారి కోల్‌కతా ఆ రెండు ఓటములకు పగ తీర్చుకుంది. ఏకంగా ఒక్క వికెట్ పోకుండా గుజరాత్‌కు చుక్కలు చూపించింది.

కోల్‌కతా బ్యాటింగ్
- గుజరాత్‌పై కోల్‌కతా 14.5 ఓవర్లలో 184 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో గెలిచింది.
- గంభీర్ 48 బంతుల్లో 12 ఫోర్లతో 76 పరుగులు చేశాడు.
- లిన్ 41 బంతుల్లో 6ఫోర్లు, ఎనిమిది సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు.
- కేవలం 14.5 ఓవర్లలో.. ఇద్దరే ప్లేయర్లు.. ఒక్క వికెట్ కోల్పోకుండా కోల్‌కతాను గెలిపించారు.
- గుజరాత్ తమ ముందుంచిన లక్ష్యాన్ని కోల్‌కతా అలవోకగా చేధించింది.
- కోల్‌కతాకు ఏ వికెట్‌కు అయినా అత్యుత్తమ భాగస్వామ్యం ఇదే.
- 12 ఓవర్లకు 147 పరుగులు చేశారు.
- ఇరువురు కూడా రెచ్చిపోయి ఆడారు. బౌండరీలతో చెలరేగారు. లిన్ - గంభీర్‌లు 10 ఓవర్లలోనే 116 పరుగులు చేశారు. అప్పటికి గంభీర్ 33 బంతుల్లో 50 పరుగులు, లిన్ 27 బంతుల్లో 60 పరుగులు చేశాడు.
- క్రిస్ లిన్ - గంభీర్ ఓపెనర్లుగా వచ్చారు.
గుజరాత్ బ్యాటింగ్
- కోల్‌కతా టార్గెట్ 184.
- గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.
జాన్సన్ రాయ్ (14), మెకల్లమ్ (35), రైనా (68 నాటౌట్), ఫించ్ (15), కార్తీక్ (47), స్మిత్ (0 నాటౌట్) పరుగులు చేశారు.
- 19.5 ఓవర్లో కార్తీక్ అవుటయ్యాడు. 25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 47 పరుగులు చేశాడు.
- 10వ ఓవర్ రెండో బంతికి ఫించ్ అవుటయ్యాడు 8 బంతుల్లో 2 సిక్సులతో 15 పరుగులు చేశాడు. గుజరాత్ 92 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
- టీమ్ స్కోర్ 72 వద్ద 2వ వికెట్ కోల్పోయింది.
- తొమ్మిదో ఓవర్ మొదటి బంతికి మెకల్లమ్ అవుటయ్యాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 35 పరుగులు చేశాడు.
- ఆ తర్వాత రైనా క్రీజులోకి వచ్చాడు. 6వ ఓవర్ అయిదో బంతిని రైనా కొట్టగా.. క్యాచ్ మిస్సయింది. రైనాకు లైఫ్ వచ్చింది. ఇది టఫ్ క్యాచ్.
- టీమ్ స్కోరు 22 పరుగుల వద్ద తొలి వికెట్ పోయింది.
- నాలుగో ఓవర్ మొదటి బంతికి జాన్సన్ రాయ్ అవుటయ్యాడు. అతను 12 బంతుల్లో మూడు ఫోర్లతో 14 పరుగులు చేశాడు.
- జాన్సన్ రాయ్ - బ్రెండన్ మెకల్లమ్ ఓపెనర్లుగా దిగారు.