For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

20వ ఓవర్లు చిత్రంగా..సస్పెన్స్‌గా: రెచ్చిన రహానే-స్మిత్, ముంబైపై పుణే విజయం

పుణే: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో గురువారం రెండో మ్యాచ్ రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ (ఆర్పీఎస్) ముంబై ఇండియన్స్ (ఎంఐ) పై 7 వికెట్ల తేడాతో గెలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. రహానే, స్మిత్‌ల అద్భుత బ్యాటింగుతో పుణే 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది. పుణే 187 పరుగులు చేసింది.

పుణే బ్యాటింగ్

- చివరి ఓవర్ కొంత సస్పెన్స్‌గా సాగింది. ముంబై ఇన్నింగ్స్‌లోను ఇదే కనిపించింది. దిండా బౌలింగులో పాండ్యా 28 పరుగులు రాబట్టడంతో.. మొత్తంగా ఆ ఓవర్లో 30 పరుగులు వచ్చాయి. పుణే చివరి ఓవర్ కూడా ఉత్కంఠగా కనిపించింది.
185 పరుగులు చేయాల్సిన తరుణంలో 19 ఓవర్లలో పుణే 172 పరుగులు చేసింది. 6 బంతుల్లో 13 పరుగులు చేయాలి.
చివరి ఓవర్ పొలార్డ్ వేశాడు. తొలి బంతికి ధోనీ ఒక పరుగు తీశాడు. రెండో బంతికి స్మిత్ ఒక పరుగు తీశాడు. మూడో బంతికి మళ్లీ ధోనీ ఒక పరుగు తీశాడు. దీంతో మూడు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ స్థితిలో స్మిత్ వరుసగా 4, 5వ బంతుల్లో రెండు సిక్సులు కొట్టి స్కోర్ 187 చేయడంతో పాటు పుణేను గెలిపించాడు.

- స్మిత్ 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 84 పరుగులు చేశాడు. చివర్లో ధోనీ 12 బంతుల్లో 12 పరుగులు చేశాడు. 19 ఓవర్ 4వ బంతి, 5వ బంతికి వరుసగా రెండు సిక్సులు కొట్టిన స్మిత్ మ్యాచును ముగించాడు.
- 16వ ఓవర్ రెండో బంతికి బెన్ స్టోక్స్ అవుటయ్యాడు. అతను 14 బంతుల్లో మూడు ఫోర్లతో 21 పరుగులు చేశాడు.
- పదో ఓవర్ 1వ బంతికి రహానే అవుటయ్యాడు. రహానే అద్భుతంగా ఆడాడు. అతను 34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 60 పరుగులు చేశాడు. అతను అవుటయ్యే సమయానికి పుణే 93 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది.
- 4వ ఓవర్లో 1వ బంతికి అగర్వాల్ అవుటయ్యాడు. 5 బంతుల్లో ఒక ఫోర్ 6 పరుగులు చేశాడు.
- అజింక్యా రహానే - మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా దిగారు.

ముంబై ఇండియన్స్ బ్యాటింగ్

చివరి ఓవర్ ఇలా...

- ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది.
- పాండ్యా 15 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులతో 35 పరుగులు చేశాడు. చివరి ఓవర్లోనే 4 సిక్సులు ఒక ఫోర్‌తో 28 పరుగులు చేశాడు. మొత్తంగా చివరి ఓవర్లో 30 పరుగులు వచ్చాయి.
- పాండ్యా తొలి బంతికి 6 కొట్టాడు. ఆ తర్వాత రెండో బంతికి, మూడో బంతికి వరుసగా సిక్సులు కొట్టాడు. నాలుగో బంతికి ఫోర్ కొట్టాడు. అయిదో బంతికి మళ్లీ సిక్స్ కొట్టాడు. ఆరో బంతికి కూడా మాత్రం టిమ్ సోథీ రనౌట్ అయ్యాడు. పరుగు తీయబోయి అవుటయ్యారు. అలాగే, ఆరో బంతి వైడ్‌గా పోయింది. దీంతో మరుసటి బంతికి ఒక పరుగు బై రూపంలో వచ్చింది.
- చివరి ఓవర్లో పాండ్యా సిక్సులతో చెలరేగిపోయాడు. చివరి ఓవర్ దిండా వేశాడు.

- 19వ ఓవర్ రెండో బంతికి పొలార్డ్ అవుటయ్యాడు. 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 27 పరుగులు చేశాడు.
- 16వ ఓవర్ 3వ బంతికి రానా అవుటయ్యాడు. 28 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 34 పరుగులు చేశాడు. 15.3 ఓవర్లకు జట్టు స్కోర్ 125.
- 14వ ఓవర్ రెండో బంతికి పాండ్యా అవుటయ్యాడు. 5 బంతుల్లో 3 పరుగులు చేశాడు.
- 12 వ ఓవర్ మొదటి బంతికి రాయుడు అవుటయ్యాడు. 12 బంతుల్లో 10 పరుగులు చేశాడు.
- బట్లర్ దూకుడుగా ఆడాడు. ఇమ్రాన్ తాహిర్ బౌలింగులోనే తొలుత రోహిత్, ఆ తర్వాత అయిదో బంతికి బట్లర్ అవుటయ్యాడు. బట్లర్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 38 పరుగులు చేశాడు.
- ఆ వెంటనే ముంబై జట్టుకు వెంటనే షాక్ తగిలింది. జోరు మీదున్న బట్లర్ అవుటయ్యాడు.
- ఏడో ఓవర్ 3 బంతికి రోహిత్ శర్మ అవుటయ్యాడు. రోహిత్ 7 బంతుల్లో మూడు పరుగులు చేశాడు.
- అయిదో ఓవర్ 2వ బంతికి పార్థివ్ అవుటయ్యాడు. 14 బంతుల్లో నాలుగు ఫోర్లో 16 పరుగులు చేశాడు.
- పార్థివ్ పటేల్ - బట్లర్ ఓపెనర్లుగా వచ్చారు.

ఐపీఎల్ 10వ సీజన్‌లో ఎనిమిది చోట్ల ప్రారంభ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైజింగ్‌ పుణె జట్టు సొంతగడ్డపై ఏర్పాటు చేసిన ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది.

సంప్రదాయ దుస్తుల్లో కళాకారులు ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రముఖ గాయని షల్మాలి కొల్గాడే తన ఆటపాటలతో అభిమానులను అలరించింది. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్‌ తార అమీ జాక్సన్‌ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+