Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: చెలరేగిన వార్నర్, పంజాబ్‌పై హైదరాబాద్ విజయం

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా కొనసాగింది. 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 19.4 ఓవర్లలో 154 పరుగులకే సన్‌రైజర్స్ ఆలౌట్ చేసింది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు మనన్ వోహ్రా 95 చేశాడు. 50 బంతుల్లో 9 ఫోర్లు 5 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే 18వ ఓవర్ 3వ బంతికి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటై సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు.

160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్, ఓపెనర్లతో సహా మిగతా ఆటగాళ్లు వరుసగా అవుటైనప్పటికీ మనన్ వోహ్రా నిలకడగా ఆడాడు. అర్ధ సెంచరీ చేసిన తర్వాత దూకుడుగా ఆడి, స్కోరు బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు.

అంతకముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 54 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 7 ఫోర్లు 2 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ నిరాశపరిచాడు. 15 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో 25 పరుగుల వద్ద తొలి వికెట్‌ రూపంలో పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రిక్స్‌ 9 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.

అక్షర్‌ పటేల్‌ వేసిన 10వ ఓవర్‌ తొలి బంతికే హెన్రిక్స్‌ పెవిలియన్‌కు చేరగా, ఆ తర్వాతి బంతికే ఆల్ రౌండర్ యువరాజ్‌ సింగ్ కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నమన్‌ ఓజా (20 బంతుల్లో 34; రెండు ఫోర్లు, ఒక సిక్సు)తో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఇషాంత్‌ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లు వేసిన ఇషాంత్‌ కేవలం 23 పరుగులు ఇచ్చాడు. పంజాబ్‌ బౌలర్లలో మోహిత్‌శర్మ, అక్షర్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు తీసుకోగా సందీప్‌ శర్మ, కరియప్ప చెరో వికెట్‌ తీశారు.

IPL 2017: Match 19: Kings XI Punjab win the toss and elect to field

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ సొంత మైదానం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

హైదరాబాద్ వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్ విజయం సాధించింది. అనంతరం కోల్‌కతా, ముంబైలతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దీంతో ఈమ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి గాడిలో పడాలని వార్నర్ సేన యోచిస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్:
డేవిడ్ వార్నర్, ధావన్, హెన్రిక్యూస్, యువరాజ్ సింగ్, దీపక్ హుడా, మహ్మద్ నబీ, ఓజా, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, బరిందర్, సిద్ధార్థ

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
మనన్ వోహ్రా, ఆమ్లా, సాహా, మోర్గాన్, డేవిడ్ మిల్లర్, మాక్స్‌వెల్, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ, కరియప్ప, ఇషాంత్ శర్మ, సందీప్ శర్మ

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+