For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చివరి ఓవర్‌లో ఉత్కంఠ: కోల్‌కతా Vs ఢిల్లీ మ్యాచ్ హైలెట్స్

ఢిల్లీ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఢిల్లీ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 169 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌‌కతా 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి నిర్దేశిత లక్ష్యాన్ని అందుకుంది. కోల్‌కతా ఆటగాళ్లలో మనీష్ పాండే (69), యూసప్ పఠాన్ (59) రాణించడంతో కోల్‌కతా విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో కోల్‌కతాకు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్లు గ్రాండ్ హోమ్ (1), గౌతం గంభీర్ (14) పరుగులకే అవుటై నిరాశపరిచారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాబిన్ ఉతప్ప(4) కూడా స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే-యూసఫ్ పఠాలు జోడి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.

Highlights: Delhi Daredevils Vs Kolkata Knight Riders

వీరిద్దరూ నాలుగో వికెట్కు 110 పరుగులు జోడించారు. చివరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి తొమ్మిది పరుగులు కావాల్సిన తరుణంలో తొలి రెండు బంతుల్లో పరుగులేమీ రాలేదు. క్రిస్ వోక్స్(3) పెవిలియన్‌కు చేరాడు. ఇక మూడో బంతిని సునీల్ నరైన్ సింగిల్ తీసి పాండేకు స్ట్రైకింగ్ ఇచ్చాడు.

నాలుగో బంతిని పాండే సిక్స్‌గా మలచాడు. ఐదో బంతికి రెండు పరుగులు తీసి విజయాన్ని అందించాడు. అంతక ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

కోల్‌కతా Vs ఢిల్లీ మ్యాచ్ హైలెట్స్:

* ఢిల్లీ డేర్ డెవిల్స్ తరుపున ఓపెనింగ్‌గా సంజూ శాంసన్, శామ్ బిల్లింగ్స్ వచ్చారు.
* పవర్ ప్లేలో ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది.
* ఏడో ఓవర్‌లో 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నాథన్ కౌల్టర్-నైలీ బౌలింగ్‌లో శామ్ బిల్లింగ్స్ పెవిలియన్‌కు చేరాడు.
* ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో 32 పరుగుల వద్ద సంజూ శాంసన్ పెవిలియన్ కు చేరాడు.
* 10 ఓవర్లకు గాను ఢిల్లీ స్కోరు 83/2
* నాథన్ కౌల్టర్-నైలీ వేసిన 15వ ఓవర్‌లో కరుణ్ నాయర్ 21 పరుగుల వద్ద అవుటయ్యాడు.
* ఉమేశ్ యాదవ్ వేసిన 17వ ఓవర్‌లో రిషబ్ పంత్ 26 పరుగులు రాబట్టాడు.
* 18వ ఓవర్‌లో సునీల్ నరేన్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ ని అవుట్ చేశాడు.
* 20 ఓవర్లకు గాను ఢిల్లీ డేర్ డెవిల్స్ 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.
* గంభీర్‌తో పాటు గ్రాండ్ హోమ్ ఓపెనింగ్‌కు వచ్చాడు. గత రెండు మ్యాచ్‌ల్లో సునీల్ నరేన్‌ను ఓపెనర్ గా వచ్చిన సంగతి తెలిసిందే.
* ఒక పరుగుకే గ్రాండ్ హోమ్ వెనుదిరిగాడు.
* రెండో ఓవర్‌లో రాబిన్ ఊతప్ప 4 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు.
* 3వ ఓవర్‌లో గౌతం గంభీర్ 14 పరుగుల వద్ద అవుటయ్యాడు.
* ఐపీఎల్ లో యూసఫ్ ఫఠాన్ 2800 పరుగులు చేశాడు.
* పవర్ ప్లే ముగిసే నాటికి కోల్‌కతా 3 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది.
* ఐపీఎల్‌లో మనీష్ పాండే 2000 పరుగులు పూర్తి చేశాడు.
* 14వ ఓవర్‌లో పఠాన్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు.
* 15వ ఓవర్‌లో క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో 59 పరుగుల వద్ద పఠాన్ వెనుదిరిగాడు.
* 16వ ఓవర్‌లో పాండే అర్ధసెంచరీ పూర్తి చేశాడు.
* 49 బంతులను ఎదుర్కొన్న పాండే 69 పరుగులు చేశాడు.
* ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పాండేకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
* 2 బంతులు మిగులుండగానే కోల్ కతా నిర్దేశిత లక్ష్యాన్ని అందుకుంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+