Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్, మ్యాచ్ 17: కోహ్లీ సేనకు మరో ఓటమి, పూణె ఘన విజయం

హైదరాబాద్: చిన్నసామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు గాను 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది.

కోహ్లీసేన లక్ష్యం 162

బెంగళూరులోని చిన్నసామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. దీంతో బెంగళూరు విజయ లక్ష్యాన్ని 162 పరుగులుగా నిర్దేశించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన పుణెకు ఓపెనర్లు చక్కటి శుభారంభం అందించారు. రహానే (30; 25 బంతుల్లో 5 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (31; 23 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్)లతో రాణించారు. పవర్‌ప్లేలో వీరిద్దరూ భారీ షాట్లతో చెలరేగి ఆరంభంలోనే భారీ స్కోరు సాధించారు. తొలి వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

రహానెను బద్రి బౌల్డ్‌ చేయగా.. అనంతరం స్వల్ప వ్యవధిలోనే త్రిపాఠి కూడా పవన్‌నేగి బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ (27; 24 బంతుల్లో3 ఫోర్లు), ధోని (28; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)లతో ఫరవాలేదనిపించారు. బెంగళూరు బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

చాహల్‌ వేసిన 14వ ఓవర్‌ చివరి బంతిని ధోనీ కసితో బాదడంతో బంతి స్టేడియం పైకప్పు మీద పడింది. అప్పటి వరకు ఆర్‌సీబీ.. ఆర్‌సీబీ.. అని కేరింతలు కొట్టిన అభిమానులు ఒక్కసారిగా ధోనీ..ధోనీ అని అరవడం ప్రారంభించారు. ఐతే షేన్‌వాట్సన్‌ వేసిన 16వ ఓవర్‌ చివరి బంతికి ధోనీ బౌల్డయ్యాడు. తర్వాతి ఓవర్‌ మొదటి బంతికే శ్రీనాథ్‌ అరవింద్‌ బౌలింగ్‌లో స్మిత్‌ కూడా బౌల్డ్ అయ్యాడు.

వీరిద్దరూ అవుటయ్యే సమయానికి పుణె నాలుగు వికెట్లకు 127 పరుగులు చేసింది. ఆపై 129 పరుగుల వద్ద క్రిస్టయన్, 130 పరుగుల వద్ద బెన్ స్టోక్స్, శార్దూల్ ఠాకూర్ లు అవుటయ్యారు. కాగా, చివర్లో మనోజ్ తివారీ అద్భుత ప్రదర్శన చేశాడు. షేన్‌ వాట్సన్‌ వేసిన 19 ఓవర్‌లో 3ఫోర్లు, సిక్సర్‌తో చెలరేగి ఏకంగా 19 పరుగులు సాధించాడు.

మనోజ్ తివారీ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు సాధించడంతో పుణె నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో మిల్నీ, అరవింద్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, శామ్యూల్ బద్రీ, షేన్ వాట్సన్, పవన్ నేగీ లకు చెరో వికెట్ దక్కింది.

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం రాయల్ ఛెలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పూణె సూపర్‌ జెయింట్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నసామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు.

IPL 2017: Match 17: Bangalore win the toss and elect to field first

దీంతో స్టీవ్ స్మిత్ సేన్ బ్యాటింగ్‌కు దిగింది. ఇరు జట్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. బెంగళూరు జట్టులో గేల్ స్థానంలో షేన్ వాట్సన్, టైమాల్ మిల్స్ స్థానంలో ఆడమ్ మిల్నే వచ్చారు. పుణె జట్టులో ఫెర్గుసన్ స్థానంలో డానియేల్ క్రిస్టియన్, అంకిత్ శర్మ స్థానంలో జయదేవ్ ఉనద్కత్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

జట్ల వివరాలు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మన్దీప్ సింగ్, ఏబీ డివీలియర్స్, కేదార్ జాదవ్(వికెట్ కీపర్), షేన్ వాట్సన్, స్టువర్ట్ బిన్నీ, పవన్ నేగీ, శమ్యూల్ బద్రీ, ఆడమ్ మిల్నే, శ్రీనాథ్ అరవింద్, యజ్వేంద్ర చాహల్.

రైజింగ్ పుణె సూపర్‌ జెయింట్: అజింక్య రహానే, రాహుల్ త్రిపాఠి, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), బెన్ స్టోక్స్, మనోజ్ తివారి, ధోని (వికెట్ కీపర్), డేనియేల్ క్రిస్టియన్, రాహుల్ చహర్, ఇమ్రాన్ తహీర్, శార్దూల్ ఠాకూర్, జయంత్ ఉనడ్కట్.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+