For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్, మ్యాచ్ 15: గేర్ మార్చిన ఢిల్లీ, పంజాబ్‌పై ఘన విజయం

ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఐపీఎల్‌ పదో సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడేందుకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా శనివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 189 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.

దీంతో ఈ సీజన్లో వరుసగా ఢిల్లీ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పంజాబ్ ఆటగాళ్లలో ఇయాన్ మోర్గాన్ (22), డేవిడ్ మిల్లర్ (24), అక్షర్ పటేల్ (44), హషీమ్ ఆమ్లా(19)లు మాత్రమే రాణించారు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్ మూడు, నదీం, కమిన్స్ చెరో రెండు వికెట్లు, అమిత్ మిశ్రా, కోరీ ఆండర్సన్ తలో వికెట్ తీసుకున్నారు.

అంతక ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌కు 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ ఆది నుంచి దూకుడుగా ఆడింది.

ఢిల్లీ ఓపెనర్లలో సంజూ శాంసన్(19) తొందరగా అవుటైనా, శ్యామ్ బిల్లింగ్స్ (40 బంతుల్లో 55; 9 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. చివర్లో కోరీ అండర్సన్(22 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), క్రిస్ మోరిస్ (16), కమిన్స్ (6 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు)లో రాణించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేసింది.

చివరి రెండు ఓవర్లలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ 35 పరుగులను రాబట్టారు. పంజాబ్ బౌలర్లలో వరుణ్ ఆరోన్ 2 వికెట్లు తీయగా సందీప్ శర్మ, మోహిత్ శర్మ, అక్సర్ పటేల్, కరియప్ప తలో వికెట్ తీశారు.

ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఐపీఎల్‌ పదో సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడేందుకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్‌ అయ్యర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.

Delhi Daredevils win the toss and elect to bat

ఈ మ్యాచ్‌లో ఆదిత్య తారేకు విశ్రాంతినిచ్చారు. మరోవైపు పంజాబ్‌ జట్టులో కూడా మార్పులు చేసినట్లు ఆ జట్టు సారథి మాక్స్‌వెల్‌ తెలిపాడు. స్టాయినిస్‌, ఇషాంత్‌ శర్మ స్థానంలో ఇయాన్‌ మోర్గాన్‌, కేసీ కరియప్ప వచ్చారు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన ఢిల్లీ, రెండో మ్యాచ్‌లో పుంజుకుని పుణెపై విజయం సాధించి ఈ సీజన్‌లో బోణి కొట్టింది.

జట్ల వివరాలు:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
హసీమ్ ఆమ్లా, మనన్ వోహ్రా, ఇయాన్ మోర్గాన్, మాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్, సాహా, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ, వరుణ్ అరోన్, సందీప్ శర్మ, కరియప్ప

ఢిల్లీ డేర్ డెవిల్స్:
శ్రేయాస్ అయ్యర్, శ్యామ్ బిల్లింగ్స్, సంజు శాంసన్, రిషబ్ పంత్, కోరె అండర్సన్, క్రిస్ మోరీస్, కరుణ్ నాయర్, పాట్ కమిన్స్, అమిత్ మిశ్రా, నదీమ్, జహీర్ ఖాన్

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+