Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈడెన్‌లో మళ్లీ ఓటమి: కోల్‌కతా Vs హైదరాబాద్ మ్యాచ్ హైలెట్స్

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ కు ఇది వరుసగా రెండో ఓటమి. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ విఫలం కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

173 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. సన్ రైజర్స్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ (26), శిఖర్ ధావన్ (23), హెన్రిక్స్ (13), యువరాజ్ సింగ్ (26), దీపక్ హుడా (13), కట్టింగ్(15) పరుగులు చేశారు.

IPL 2017: Match 14: Highlights: Kolkata Knight Riders Vs Sunrisers Hyderabad

కోల్‌కతా బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీసుకోగా బౌల్ట్, సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్, యూసఫ్ పఠాన్‌లు తలో వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. తాజా విజయంతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది.

కోల్‌కతా Vs హైదరాబాద్ మ్యాచ్ హైలెట్స్:

* హైదరాబాద్‌పై 17 పరుగుల తేడాతో కోల్ కతా విజయం సాధించింది.
* సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
* యువరాజ్ సింగ్ 16 బంతుల్లో 26 పరుగులు చేశాడు.
* సునీల్ నరేన్ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి 18 పరుగులిచ్చాడు.
* ఈడెన్ గార్డెన్స్‌లో సన్ రైజర్స్‌తో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కోల్ కతా విజయం సాధించింది.
* సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి 20 పరుగులిచ్చాడు.
* మూడో వికెట్‌కు రాబిన్ ఊతప్ప, మనీష్ పాండేల జోడీ 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* మనీష్ పాండే 35 బంతులాడి 46 పరుగులు చేశాడు.
* రాబిన్ ఊతప్ప 39 బంతుల్లో 68 పరుగులు చేశాడు.
* గౌతం గంభీర్‌తో కలిసి సునీల్ నరేన్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+