Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకే రోజు రెండో హ్యాట్రిక్: పూణె Vs గుజరాత్ మ్యాచ్ హైలెట్స్

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా గుజరాత్‌ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. తొలి ఓవర్‌ మూడో బంతికే ఓపెనర్‌ రహానె(0)ను ఔట్‌ చేసిన ప్రవీణ్‌ కుమార్‌ గుజరాత్‌కు మంచి శుభారంభం అందించాడు.

రాహుల్ త్రిపాఠి (17 బంతుల్లో 33)తో కలిసి కెప్టెన్ స్మిత్ (28 బంతుల్లో 33) దూకుడుగా ఆడటంతో పవర్ ప్లే ముగిసే సమయానికి పుణే రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. త్రిపాఠి తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన బెన్ స్టోక్స్ 25 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.

Highlights: Gujarat Lions Vs Rising Pune Supergiant

ఈ సీజన్లో ఫామ్ లేమితో సతమతం అవుతున్న మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన ధోనీ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మనోజ్ తివారి (27 బంతుల్లో 31), అంకిత్ శర్మ (15 బంతుల్లో 25) జోడి రాణించారు.

మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌ బౌలర్ ఆండ్రూ టై చివరి ఓవర్ తొలి మూడు బంతుల్లో ఈ అద్భుతం సాధించాడు. ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ నమోదు చేసిన పూణెను దెబ్బతీశాడు. రైజింగ్ పుణె సూపర్‌ జెయింట్ బ్యాట్స్‌మెన్ అంకిత్ శర్మ, మనోజ్ తివారీ, ఎస్‌ఎన్ ఠాకూర్‌లను అవుట్ చేశాడు.

అరంగేట్రంలోనే హ్యాట్రిక్ నమోదు చేయడంతోపాటు ఐదు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. చివరి ఓవర్ తొలి బంతికి మనోజ్ తివారిని అవుట్ చేసిన ఆండ్రూ టై.. రెండో బంతికి అంకిత్ శర్మను పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన శార్దుల్ థాకూర్‌ను మూడో బంతికి క్లీన్ బౌల్డ్ చేసిన ఆండ్రూ టై ఈ సీజన్లో రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు.

డెత్ ఓవర్లు వేయడానికి ఇష్టపడే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టై 20వ ఓవర్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు వికెట్లు కోల్పోయిన పూణె ఆ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే సాధించిది. నాలుగు ఓవర్లు వేసిన ఆండ్రూ టై 17 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ఆండ్రా టై దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో పూణె 171 పరుగులు చేసింది.

పూణె Vs గుజరాత్ మ్యాచ్ హైలెట్స్:

* గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనాకు ఇది 150వ ఐపీఎల్ మ్యాచ్
* ఈ మ్యాచ్‌లో రైనా పట్టిన ఓ అద్భుతమైన క్యాచ్‌కి రహానే పెవిలియన్‌కు చేరాడు.
* తొలి ఓవర్ లోనే రహానే డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
* పూణె జట్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఒక్కడే 43 పరుగులతో రాణించాడు.
* ఇన్నింగ్స్ ‌ రెండో ఓవర్ వేసిన ప్రవీణ్ కుమార్ బౌలింగ్‌లో పూణె బ్యాట్స్‌ మెన్ 25 పరుగులు రాబట్టారు.
* 25 పరుగుల వద్ద ఆండ్రూ టై బౌలింగ్‌లో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వెనుదిరిగాడు.
* ఈ మ్యాచ్‌లో ధోనీ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన ధోనీ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
* ఈ మ్యాచ్‌లో పూణె జట్టు 50 పరుగుల మైలురాయిని 27 బంతుల్లో పూర్తి చేసింది. ఐపీఎల్‌లో ఇదే వేగంగా చేయడం.
* ఐపీఎల్ చరిత్రలోనే శుక్రవారం రెండు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. సాయంత్రం 4 గంటలకు ముంబై Vs బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో శామూల్స్ బద్రీ ఈ ఘనత సాధించగా, కొన్ని గంటల వ్యవధిలోనే రాత్రి 8 గంటలకు జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్ ఆండ్రూ టై ఈ హ్యాట్రిక్ సాధించాడు.
* ఆండ్రూ టై వేసిన 20వ ఓవర్‌లో పూణె నాలుగు పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లను కోల్పోయింది.
* 171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ తొలి వికెట్‌కు 94 పరుగులు చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+