For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: గర్జించిన గుజరాత్‌ లయన్స్, ఎట్టకేలకు బోణీ కొట్టింది

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో భాగంగా శుక్రవారం రాజ్‌కోట్‌లో గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: హైదరాబాద్: ఎట్టకేలకు ఐపీఎల్ పదో సీజన్‌లో గుజరాత్ తొలి విజయాన్ని అందుకుంది. 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్లు డ్వేన్ స్మిత్ (30 బంతుల్లో 47), బ్రెండన్ మెక్‌కల్లమ్ (32 బంతుల్లో 49) గుజరాత్‌కు చక్కటి శుభారంభాన్నిచ్చారు.

Gujarat Lions win the toss and elect to field

ఈ ఇద్దరి జోడి తొలి వికెట్‌కు 8.5 ఓవర్లలోనే 94 పరుగులు జోడించింది. స్మిత్‌ను థాకూర్ పెవిలియన్‌కు పంపగా.. చాహల్ బౌలింగ్‌లో మెక్‌కల్లమ్‌ను ధోని స్టంపౌట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ (3) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా (22 బంతుల్లో 35), ఆరోన్ ఫించ్ (19 బంతుల్లో 33) చెలరేగడంతో గుజరాత్‌కు విజయం సాధించింది. పుణె బౌలర్లలో ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, చాహర్‌లకు తలో వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో తీసిన గుజరాత్‌ బౌలర్‌ ఆండ్రూ టైకు మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.


గుజరాత్ విజయ లక్ష్యం 172

రాజ్‌కోట్ వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రైజింగ్ పూణె సూపర్ జెయింట్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.

దీంతో గుజరాత్ లయన్స్ లక్ష్యం 172 పరుగులుగా నిర్దేశించింది. ఈ మ్యాచ్‌ 20వ ఓవర్‌లో గుజరాత్ బౌలర్ ఆండ్రూ టై హ్యాట్రిక్ సాధించాడు. ప్రవీణ్ కుమార్ బౌలింగ్‌లో మొదటి ఓవర్‌ నాలుగో బంతికి ఓపెనర్ రహానె డకౌట్‌గా వెనుదిరిగినా, రాహుల్ త్రిపాఠి 33, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 43, బెన్ స్టోక్స్ 25 పరుగులతో రాణించారు.

గుజరాత్ బౌలర్లలో ఆండ్రూ టై ఐదు వికెట్లు తీయగా, ప్రవీణ్ కుమార్, రవీంద్ర జడేజా, డ్వెయిన్ స్మిత్ తలో వికెట్ తీసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో భాగంగా శుక్రవారం రాజ్‌కోట్‌లో గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.

 Gujarat Lions win the toss and elect to field

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సురేశ్ రైనా నేతృత్వంలోని గుజరాత్ లయన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేదు. దాంతో పూణెతో జరుగుతున్న మ్యాచ్‌లో బోణి కొట్టాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ పదో సీజన్‌లో రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌లో తొలిసారి ఆడుతున్నాడు.

ధావళ్ కులకర్ణిని తప్పించిన రైనా ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఇక పూణె జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అంకిత్‌శర్మను తుది జట్టుకు ఎంపికచేసినట్లు పుణె కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ తెలిపాడు. పుణె తరఫున యువ క్రికెటర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్నాడు.

గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనాకు ఇది 150వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. ఇక పూణె సూపర్ జెయింట్ కూడా ఒక విజయం మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌లు ఆడిన పూణె కేవలం ఒక మ్యాచ్‌లోనే విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పూణె ఓటమి పాలైంది.

జట్ల వివరాలు:
గుజరాత్ లయన్స్:
B McCullum, A Finch, S Raina, D Karthik, DR Smith, I Kishan, R Jadeja, A Tye, P Kumar, B Thampi, S Jakati

రైజింగ్ పూణె సూపర్ జెయింట్:
A Rahane, M Tiwary, S Smith, B Stokes, MS Dhoni, R Tripathi, A Sharma, L Ferguson, R Chahar, I Tahir, S Thakur

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+