Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్, మ్యాచ్ 12: ముంబై హ్యాట్రిక్, బెంగళూరుపై ఘన విజయం

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పదో సీజన్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్‌ పదో సీజన్‌లో వరుసుగా మూడో విజయాన్ని సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతోంది.

బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓడిపోతుందనుకున్ సమయంలో కీరన్ పొలార్డ్ (70), క్రునాల్ పాండ్యా (37) కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

వీరిద్దరి అద్భుత భాగస్వామ్యంతో బెంగళూరుపై ఏడు బంతులు మిగిలుండగానే ముంబై విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ జట్టు 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 చేసి 4 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్ శ్యామ్యూల్ బద్రి హ్యాట్రిక్ సాధించాడు. పార్ధీవ్ పటేల్, మెక్లెంగన్, రోహిత్ శర్మలను వరుస బంతుల్లో అవుట్ చేశాడు.


ముంబై విజయ లక్ష్యం 143

బెంగళూరు వేదికగా ముంబైతో ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని 143గా నిర్దేశించింది. బెంగళూరు జట్టులో కెప్టెన్ కోహ్లీ (47 బంతుల్లో 62, 5 ఫోర్లు, 2 సిక్సులు)తో అర్ధసెంచరీని సాధించాడు.

ఈ మ్యాచ్‌లో క్రిస్‌గేల్ తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. తొలి రెండు ఓవర్లు దూకుడుగా ఆడిన ఈ జోడి ఆ తర్వాత దూకుడుగా ఆడింది. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముంబై బౌలర్ టిమ్ సౌథీ వేసిన మూడో ఓవర్‌లో విరాట్ కోహ్లీ 17 పరుగులు రాబట్టాడు.

ఆ ఓవర్ తొలి బంతిని సిక్స్ కొట్టిన కోహ్లీ, ఆ తరువాత మూడు, నాలుగు బంతుల్ని ఫోర్లుగా మలచాడు. ఆ ఓవర్‌లో 17 పరుగులు సాధించి స్కోరు బోర్డులో వేగం పెంచాడు. ఆపై తర్వాద వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డు వేగాన్ని పెంచారు.

క్రిస్ గేల్ 22 పరుగుల అవుటైన తర్వాత కోహ్లీ కాస్త నెమ్మదిగా ఆడాడు. కాగా, బూమ్రా వేసిన 14 ఓవర్ మూడో బంతిని డివిలియర్స్ సిక్స్ కొట్టగా, ఆ తర్వాత ఐదు, ఆరు బంతుల్ని విరాట్ కోహ్లీ సిక్సర్, ఫోర్‌గా మలిచాడు. ఇదే సమయంలో కోహ్లీ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లను కోల్పోవడంతో బెంగళూరు భారీ స్కోరు చేయలేకపోయింది. బెంగళూరు ఆటగాళ్లలో ఏబీ డివిలియర్స్ (19), కేదర్ జాదవ్(9), మన్ దీప్(0)లు పెద్దగా ఆడలేదు. దీంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లీన్ గన్ రెండు వికెట్లు తీసుకోగా, హర్ధిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.

ఇండియన్ ప్రీమయర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో జరుగుతుంది. గత మూడు మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడు.

భుజం నొప్పి గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్ పదో సీజన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే. ఇరు జట్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్ పదో సీజన్‌లో శామ్యూల్‌ బద్రీ తొలి మ్యాచ్‌ ఆడుతున్నాడు. షేన్‌ వాట్సన్‌ స్థానంలో క్రిస్‌ గేల్‌ జట్టులోకి వచ్చాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లపై వరుస విజయాలతో ఊపు మీదున్న ముంబై జట్టు ఒక మార్పుతో బరిలో దిగుతోంది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్ మలింగ ఫిట్‌గా లేకపోవడంతో అతడి స్థానంలో సౌథీకి తుది జట్టులో చోటు కల్పించారు.

జట్ల వివరాలు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: V Kohli (captain), C Gayle, AB de Villiers, K Jadhav, M Singh, S Binny, P Negi, T Mills, S Aravind, Y Chahal, S Badree.

ముంబై ఇండియన్స్: N Rana, P Patel, J Buttler, K Pollard, RG Sharma (captain), H Pandya, H Singh, K Pandya, J Bumrah, T Southee, M McClenaghan.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+