For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్ 11 హైలెట్స్: ఉమేశ్ విజృంభణ, కోల్‌కతా ఓపెనర్‌గా నరేన్

గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి తన రాకను ఘనంగా చాటుకున్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ ఉమేశ్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి తన రాకను ఘనంగా చాటుకున్నాడు.

దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 170 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా విజయ లక్ష్యం 171 పరుగులుగా నిర్దేశించింది. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన 18వ ఓవర్‌ ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పింది. ఈ ఓవర్‌ తొలి రెండు బంతులను సిక్స్‌, ఫోర్‌గా మలిచిన మిల్లర్‌‌ను మూడో బంతికి పెవిలియన్‌కు చేర్చాడు.

Match 11: Highlights: Kolkata (KKR) Vs Punjab (KXIP)

ఇక నాలుగో బంతికి దూకుడుగా ఆడుతున్న వృద్ధిమాన్ సాహా పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అక్షర్‌ పటేల్‌‌ను ఆరో బంతికి డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. ఇలా ఐపీఎల్ పదో సీజన్‌లో తాను అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్, సాహా, అక్షర్ పటేల్‌లను అవుట్ చేసి సత్తా చాటాడు.

మరోవైపు ఆరంభంలో భారీ స్కోరు రాకుండా పంజాబ్‌ బ్యాట్స్‌మెన్లను కోల్‌కతా బౌలర్లు కట్టడి చేశారు. పంజాబ్ ఓపెనర్లు మనన్‌ వోహ్రా (28), ఆమ్లా (25) పంజాబ్‌కు మంచి శుభారంభాన్నిచ్చారు. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడటంతో పంజాబ్ ఐదు ఓవర్లలోనే 53 పరుగులు చేసింది.

ఈ సమయంలో కోల్‌కతా స్పిన్నర్‌ పియూష్ చావ్లా తన తొలి ఓవర్‌ మొదటి బంతికే వోహ్రాను బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టోనిస్ (9) పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం కెప్టెన్‌ మాక్స్‌వెల్‌ (25: 14 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సు), డేవిడ్‌ మిల్లర్‌ (19బంతుల్లో 28, 4 ఫోర్లు, 2 సిక్సులు) భారీ భాగస్వామ్యం దిశగా సాగారు.

అయితే ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌ అవుట్ కావడంతో పంజాబ్‌ స్కోరు బోర్డు మందగించింది. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్‌తో పాటు వృద్ధిమాన్‌ సాహా(25) ధాటిగా ఆడేందుకు ప్రయత్నించారు. బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరి కలిసి 57 పరుగులు జోడించారు.

అయితే వీరిద్దరూ 155 పరుగుల వద్ద వరుసగా పెవిలియన్ చేరడంతో పంజాబ్ స్కోరు బోర్డు నెమ్మదించింది. ఇక చివరి రెండు ఓవర్లలో 14 పరుగులు రావడంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్ నాలుగు, క్రిస్‌ వోక్స్‌ రెండు వికెట్లు తీసుకుని అద్భుత ప్రదర్శన చేశారు.

మ్యాచ్ హైలెట్స్:

* పంజాబ్ ఓపెనర్లు మనన్‌ వోహ్రా, ఆమ్లా తొలి ఐదు ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* కోల్ కతా స్పిన్నర్ పియూష్ చావ్లా తాను వేసిన తొలి బంతికే పంజాబ్ ఓపెనర్ మనన్‌ వోహ్రాను పెవిలియన్‌కు చేర్చాడు.
* సునీల్ నరేన్ పంజాబ్ బ్యాట్స్‌మెన్ స్టోనిస్ వికెట్‌ను 8వ ఓవర్‌‌లో తీశాడు. ఈ వికెట్ మ్యాచ్‌‌కి కీలక మలుపు.
* 18వ ఓవర్‌లో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు. ఈ ఓవర్‌ తొలి రెండు బంతులను సిక్స్‌, ఫోర్‌గా మలిచిన మిల్లర్‌‌ను మూడో బంతికి పెవిలియన్‌కు చేర్చాడు. ఇక నాలుగో బంతికి దూకుడుగా ఆడుతున్న వృద్ధిమాన్ సాహా పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అక్షర్‌ పటేల్‌‌ను ఆరో బంతికి డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు.
* పేసర్ ఉమేశ్ యాదవ్ 4-0-33-4తో ఐపీఎల్ పదో సీజన్‌లో తన రాకను ఘనంగా చాటుకున్నాడు.
* 20వ ఓవర్‌లో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీశాడు.
* పంజాబ్ జట్టులో అత్యధిక స్కోరు 28. డేవిడ్ మిల్లర్, ఓపెనర్ మనన్ వోహ్రాలు 28 పరుగులు చేశారు.
* కోల్ కతా జట్టు తరుపున సునీల్ నరేన్ 4-0-19-1తో అత్యుత్తమ ఎకనమిక్ బౌలర్‌గా నిలిచాడు.
* ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాళ్లు రెండు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* గంభీర్‌తో కలిసి సునీల్ నరేన్ ఓపెనింగ్ బ్యాటింగ్‌కు దిగాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+