హైదరాబాద్: ఐపీఎల్ 10లో భాగంగా హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. 35 పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులు చేసింది. యువరాజ్, హెన్రిక్స్‌లు అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఏ దశలోను పరుగులు చేదించేలా కనిపించలేదు.
బెంగళూరు జట్టులో అత్యధిక స్కోర్ క్రిస్ గేల్‌దే (32). కానీ అతను కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత వరుసగా బ్యాట్సుమెన్ క్యూ కట్టారు. దీంతో బెంగళూరు 19.4 ఓవర్లలోనే 172 పరుగలకు ఆలౌట్ అయింది. అంతకుముందు బెంగళూరు టాస్ గెలిచింది. జట్టు కెప్టెన్ షేన్ వాట్సన్ ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు.

బెంగళూరు బ్యాటింగ్
- 19 ఓవర్లో నాలుగో బంతికి చాహాల్ రనౌట్ అయ్యాడు. అన్ని వికెట్లు పోయాయి.
- 19వ ఓవర్లో మిల్స్ అవుటయ్యాడు.
- 18వ ఓవర్లో రెండు వికెట్లు పడ్డాయి. మూడో బంతికి వాట్సన్, నాలుగో బంతికి అరవింద్ అవుటయ్యాడు.
17 ఓవర్ 5వ బంతికి బిన్నీ అవుటయ్యాడు. 10 బంతుల్లో 11 పరుగులు చేశాడు.
- 14వ ఓవర్లో బిపుల్ శర్మ అవుటయ్యాడు. 3 బంతుల్లో 1 పరుగు చేశాడు.
- 13వ ఓవర్ అయిదో బంతికి హెడ్ అవుటయ్యాడు. హెడ్ 22 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేశాడు.
- 12వ ఓవర్లో జాదవ్ అవుటయ్యాడు. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, 1 సిక్స్‌తో 31 పరుగులు చేశాడు.
- ఏడో ఓవర్ 3వ బంతికి గేల్ అవుటయ్యాడు. అతను 21 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సులో 32 పరుగులు చేశాడు. ఐపీఎల్ అంటేనే గేల్ సునామీ. అయితే గత ఒకటి రెండు సీజన్లుగా అభిమానులను అతను అలరించడం లేదు. అప్పుడప్పుడు మాత్రమే దూకుడుగా ఆడుతున్నాడు. తొలి మ్యాచులో అభిమానుల్ని నిరాశపరిచాడు.
- ఆరో ఓవర్లో 4వ బంతికి మన్‌దీప్ అవుటయ్యాడు. 16 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేశాడు.
- మన్‌దీప్ - క్రిస్ గేల్ బరిలోకి ఓపెనర్లుగా బరిలోకి దిగారు.
హైదరాబాద్ బ్యాటింగ్
- బెంగళూరు ముందు హైదరాబాద్ 208 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
- మిల్స్, చౌదరి, బిన్నీ, చాహాల్‌లు ఒక్కో వికెట్ తీశారు.
- యువరాజ్, హెన్రిక్స్‌లు అర్ధ సెంచరీలు చేశారు.
- వార్నర్ (14), ధావన్ (40) , హెన్రిక్స్ (52), యువరాజ్ సింగ్ (62) పరుగులు చేశారు. వీరు నలుగురు అవుటయ్యారు. చివరలో హుడా 12 బంతుల్లో 16 పరుగులు, కట్టింగ్ 6 బంతుల్లో 16 పరుగులు చేశారు.
- హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది.
- 19వ ఓవర్లో యువరాజ్ సింగ్ అవుటయ్యాడు. 27 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు.
- 16వ ఓవర్లో రెండో బంతికి హెన్రిక్స్ అవుటయ్యాడు. అతను 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 52 పరుగులు చేశాడు.
- హెన్రిక్స్ - యువరాజ్‌ల జోడీ దూకుడు ప్రదర్శించింది. జట్టు 11 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. కానీ 15 ఓవర్లు ముగిసేసరికి 151 పరుగులు చేసింది ఈ జోడి.
- హెన్రిక్స్‌కు జత కలిసిన యువరాజ్ వచ్చీ రాగానే దూకుడుగా ఆడాడు. 13వ ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో ఫోర్, సిక్స్, ఫోర్ కొట్టాడు.
- 11వ ఓవర్ మూడో బంతికి శిఖర్ ధావన్ అవుటయ్యాడు. ధావన్ 31 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేశాడు.
- 3వ ఓవర్ ముగిసేసరికి హెన్రిక్స్, ధావన్ క్రీజులో ఉన్నారు. 29 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది.
- వార్నర్ వచ్చీ రాగానే దూకుడుగా ఆడాడు. అయితే, రెండో ఓవర్లో నాలుగో బంతికి అవుటయ్యాడు. వార్నర్ 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 14 పరుగులు చేశాడు.
- శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్‌లో బ్యాటింగ్‌కు దిగారు.