Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 10: ఆరంభ మ్యాచ్‌పై ఉత్కంఠ, తుది జట్టులో చోటు వీరికే

హైదరాబాద్: కొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు మొదలుకానున్నాయి. వేసవిలో క్రికెట్ అభిమానులకు అసలైన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఆరంభ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది.

స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఏబీ డివిలియర్స్ లేకుండానే బెంగళూరు బరిలో దిగనుంది. మరోవైపు తొలి మ్యాచ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు పూర్తిగా సన్నద్ధమయ్యారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చే అంశం ఏంటంటే ఆటగాళ్లంతా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారు.

మరి కొన్ని గంటల్లో తొలి మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఎవరెవరో తుది జట్టులో చోటు దక్కించుకునే దానిపై ఉత్కంఠ నెలకొంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. వార్నర్, ధావన్, యువరాజ్ సింగ్ లాంటి హిట్టర్లు ఈ జట్టులో ఉన్నారు.

భువనేశ్వర్, నెహ్రా తదితరులతో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది. ఇటీవలే భారత్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన డేవిడ్ వార్నర్‌కు తొలి మ్యాచ్‌లో కఠిన పరీక్ష ఎదురు కానుంది. అయినా సరే ధావన్‌తో కలిసి వార్నర్ ఓపెనింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.

ఇక మూడో స్ధానంలో దీపక్ హుడా బ్యాటింగ్‌కు దిగే అవకాశాలు ఉన్నాయి. మిడిలార్డర్‌లో కీలకమైన యువరాజ్ సింగ్ నాలుగోస్థానంలో, కీపర్ నమన్ ఓజా తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌కు రావచ్చు. లేదంటే ఓజాను టాప్ ఆర్డర్‌లో పంపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే ఆస్ట్రేలియా ఆటగాళ్లు హెన్రిక్స్, తమిళనాడుకు చెందిన విజయ్ శంకర్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్ధానంలో ఆప్ఘనిస్తాన్‌కు చెందిన మహ్మద్ నబీకి తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడు.

ఇక హైదరాబాద్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఆప్ఘనిస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ప్రవీణ్ తాంబే ఎవరో ఒకరికి చోటు దక్కొచ్చు. ఇక పేస్ బౌలింగ్ విభాగం నుంచి భువనేశ్వర్, నెహ్రాలకు చోటు దక్కడం ఖాయం. తొలి మ్యాచ్ తర్వాత బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ జట్టులోకి వస్తాడని కోచ్ టామ్ మూడీ అన్నాడు.

డేవిడ్ వార్నర్

డేవిడ్ వార్నర్

ఇటీవల ఇండియాతో ముగిసిన టెస్టు సిరిస్‌లో వార్నర్ విఫలమయ్యాడు. అయితే ధర్మశాల టెస్టులో డేవిడ్ వార్నర్ రాణించడంతో జట్టు కాస్త ఉత్సాహంలో ఉంది. హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వార్నర్ నుంచి అభిమానులు కీలక ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు.

శిఖర్ ధావన్

శిఖర్ ధావన్

గాయం కారణంగా టీమిండియాలో శిఖర్ ధావన్ చోటు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో రాణించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కించుకోవాలని ఊవిళ్లూరుతున్నాడు. ఇటీవల ముగిసిన దేవధర్ ట్రోఫీలో ధాన్ అద్భుత ప్రదర్శన చేశాడు.

కేన్ విలియమ్సన్

కేన్ విలియమ్సన్

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లలో కేన్ విలియమ్సన్ ఒకడు. అయితే గతేడాది ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. మూడో స్ధానంలో విలియమ్సన్ బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది.

యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్

టీమిండియా వెటనర్ ఆటగాడు యువరాజ్ సింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టీ20 ఫార్మెట్‌లో యువీ స్టైలే వేరు. టీమిండియాకు ఐసీసీ వరల్డ్ టీ20 వరల్డ్ కప్ సాధించడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఆ ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానులకు గుర్తే.

దీపక్ హూడా

దీపక్ హూడా

హైదరాబాద్ జట్టులో ఉన్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు.

నోమన్ ఓజా

నోమన్ ఓజా

టీమిండియా వెటరన్ క్రికెటర్ నోమన్ ఓజా. హైదరాబాద్ జట్టుకు వికెట్ కీపర్‌గా ఉన్నాడు. ఈ సీజన్‌లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు.

మొసిస్ హెన్రీక్యూస్

మొసిస్ హెన్రీక్యూస్

ఆస్ట్రేలియాకు చెందిన మొసిస్ హెన్రీక్యూస్ అద్భుతమైన ఆల్ రౌండర్. బ్యాట్‌తో పాటు బౌలింగ్‌లో కూడా రాణించగలడు. మీడియం పేసర్ అయిన మొసిస్ హెన్రీక్యూస్ బంతిని బలంగా బాదే క్రికెటరల్లో ఒకడు. అద్భుతమైన సిక్సులు కొట్టగలడు.

భువనేశ్వర్ కుమార్

భువనేశ్వర్ కుమార్

టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ గతేడాది సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అభిమానుల అంచనాలు అందుకునేందుకు శ్రమిస్తామని భువీ చెప్పాడు. టీ20ల్లో డెత్ ఓవర్లు కీలకమైనవని అభిప్రాయపడ్డాడు. తొలి ఓవర్ నుంచి దూకుడుగా ఆడినప్పటికీ చివర్లో ప్రతి బ్యాట్స్ మన్ వీలైనన్ని పరుగులు పిండుకునేందుకు ప్రయత్నిస్తాడని తెలిపాడు. అందుకే చివరి 5 ఓవర్లు ఎవరు అద్భుతంగా బౌలింగ్ చేయగలిగితే ఆ జట్టు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పాడు. తమ జట్టుకు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ వనరులు కూడా బాగున్నాయని కితాబునిచ్చాడు. ఈసారి టైటిల్ ను నిలబెట్టుకోవడం కీలకమని భువనేశ్వర్ తెలిపాడు.

రషీద్ ఖాన్

రషీద్ ఖాన్

18 ఏళ్ల రషీద్ ఖాన్ ఐపీఎల్ 10వ సీజన్‌ను అనుకూలంగా మలచుకోవాలని ఊవిళ్లూరుతున్నాడు. ఇదే ఇతడికి తొలి ఐపీఎల్. తన చిన్ననాటి హీరో యువరాజ్ సింగ్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకోవాలని ఎంతో ఆసక్తితో ఉన్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మెట్‌లో 2017లో రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

ప్రవీణ్ తాంబే

ప్రవీణ్ తాంబే

ఐపీఎల్‌లో అత్యధిక వయసు కలిగిన క్రికెటర్లో ప్రవీణ్ తాంబే ఒకడు. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున అరంగేట్రం చేస్తున్నాడు. ఈరోజు బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో తుది జట్టులో తాంబే చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

ఆశిష్ నెహ్రా

ఆశిష్ నెహ్రా

టీమిండియా వెటరన్ క్రికెటర్లలో ఆశిష్ నెహ్రా ఒకడు. పూర్తి ఫిట్‌నెస్ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఫిట్ నెస్ చాలా ముఖ్యమైనది కావడంతో కొన్నేళ్లుగా ఫిట్ నెస్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. ఐదారేళ్లుగా ఫిట్ నెస్ సాధన తన కెరీర్ లో భాగమైందని నెహ్రా చెప్పాడు.

రోజూ ఐదారు గంటలు ఫిట్ నెస్ సాధన చేస్తానని, తరువాత బౌలింగ్ సాధన చేస్తానని నెహ్రా తెలిపాడు. పేస్ తనకు సహజంగా అబ్బిందని అన్నాడు. తన బలమే పేస్ అని, దానిని అనుకూలంగా మార్చుకుంటూ బౌలింగ్ చేస్తానని చెప్పాడు. వేగంగా బౌలింగ్ చేయడం అంత సులువైన విషయం కాదని చెప్పిన నెహ్రా, పూర్తి ఫిట్ నెస్ తో ఉంటేనే వేగంగా బౌలింగ్ చేయగలమని తెలిపాడు. ఈ సీజన్ లో టాప్ 4 బౌలర్లలో ఒకడిగా నిలవాలని అనుకుంటున్నానని నెహ్రా తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: IPL 2017: Probable SRH XI
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+