హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో గుజరాత్ లయన్స్ ఆటగాడు అరోన్ ఫించ్ ఓ వింత కారణంతో మ్యాచ్‌కు ఆదివారం నాటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. వాంఖేడ్ వేదికగా ఆదివారం ముంబై ఇండియన్స్-గుజరాత్ లయన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
కిట్‌బ్యాగ్ మరచిపోయి కారణంగా ఆరోన్ ఫించ్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్నిగుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా వెల్లడించాడు. గత మ్యాచ్ ఆడిన రాజ్ కోట్ నుంచి అరోన్ ఫించ్ కిట్ బ్యాగ్ ముంబైకి చేరేలేదట. దాంతోనే ముంబైతో మ్యాచ్ నుంచి ఫించ్ తప్పుకున్నట్లు రైనా తెలిపాడు.

అరోన్ ఫించ్ రాజ్‌కోట్‌లో తన క్రికెట్ కిట్ బ్యాగును వదిలి ముంబై చేరుకున్నాడు. దీంతో మ్యాచ్‌కు ముందు తన కిట్ కోసం వెతకగా కనిపించలేదు. జట్టులోని సహచరుల కిట్ నుంచి బ్యాట్ తీసుకుని ఆడటానికి ఫించ్ నిరాకరించడంతో మొత్తం మ్యాచ్ కే దూరం కావాల్సి వచ్చింది. దీంతో అతని స్థానంలో మరో ఆటగాన్ని జట్టులోకి తీసుకున్నారు.
మా జట్టులో రెండు మార్పులు చేస్తున్నాం. ఫించ్ మ్యాచ్‌కు దూరమవుతున్నాడు. దురదృష్టవశాత్తు అతని కిట్ బ్యాగు సమయానికి అందలేదు. ఫించ్, జకాతి స్థానంలో జాసన్ రాయ్, మునాఫ్ పటేల్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు టాస్‌కు వచ్చిన సమయంలో గుజరాత్ కెప్టెన్ సురేశ్‌రైనా తెలిపాడు.
ఐపీఎల్‌లో స్పాన్సర్లతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సంబంధిత స్పాన్సర్ పేరుతో ఉన్న బ్యాట్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ సహచరుల బ్యాట్‌తో ఆడిన క్రమంలో స్పాన్సర్ల నుంచి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఫించ్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు.
నిజానికి గాయాలు, ఫామ్‌లేమి కారణంగా ఆటగాళ్లు మ్యాచ్‌లకు దూరమైన సందర్భాలను గతంలో ఎన్నో చూశాం. కానీ కిట్ బ్యాగ్ లేని కారణంగా ఓ క్రికెటర్ మ్యాచ్ దూరమవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.