Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మొహాలిలో ఢిల్లీ విజయ లక్ష్యం 167

KXIP

హైదరాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మొహాలి వేదికగా సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆరంభంలో దూకుడుగా కనిపించిన కేఎల్ రాహుల్(15) అదే ఓవర్ ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఆ తర్వాత కొద్ది సేపటికే సందీప్ వేసిన 4వ ఓవర్ ఐదో బంతికి శామ్ కర్రన్(20) కూడా నిష్క్రమించడంతో కింగ్స్‌ పంజాబ్‌ 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మరో 22 పరుగుల వ్యవధిలో​ మయాంక్‌ అగర్వాల్‌(6) కూడా ఔట్‌ కావడంతో కింగ్స్‌ మరింత కష్టాల్లో పడింది. ఈ దశలో కష్టాల్లోపడ్డ జట్టుకు సర్ఫరాజ్, మిల్లర్‌ల జోడీ అండగా నిలిచింది.

వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కి 62 పరుగులు జోడించారు. అయితే, దూకుడుగా ఆడుతోన్న ఈ జోడీని సందీప్ విడగొట్టాడు. సందీప్ వేసిన 14వ ఓవర్ ఐదో బంతికి సర్ఫరాజ్(39) పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరూ 62 పరుగులు భాగస్వామ్యం చేయడంతో కింగ్స్‌ తేరుకుంది.

1
45769

ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన మన్‌దీప్‌ సింగ్‌(29 నాటౌట్‌) కలిసి మిల్లర్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. అయితే క్రిస్ మోరిస్ వేసిన 17వ ఓవర్ రెండో బంతికి మిల్లర్(43) భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్‌ మోరిస్‌ మూడు, లమిచానే, రబడాలు తలో రెండు వికెట్లు తీశారు.

Story first published: Monday, April 1, 2019, 22:50 [IST]
Other articles published on Apr 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+