Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మనసులో మాట: 'నా ఐపీఎల్‌ కెరీర్‌‌ని ఢిల్లీతో ముగించాలి'

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గత ఏడేళ్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుని కెప్టెన్‌గా గౌతం గంభీర్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. గంభీర్ నేతృత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ రెండు సార్లు ఐపీఎల్ టైటిల్‌ని కూడా గెలుచుకుంది.

కోల్ కతా జట్టుతో గంభీర్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అలాంటి గంభీర్ తన ఐపీఎల్ కెరీర్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుతో ముగించాలని కోరుకుంటున్నాడు. 'ఇప్పటికీ నా హృదయం ఢిల్లీతోనే ఉంది. నేను మూడేళ్ల పాటు డేర్‌డెవిల్స్‌కు ఆడాను. నా ఐపీఎల్‌ కెరీర్‌ను ఢిల్లీతో ముగించడానికి ఇష్టపడతాను' అని గంభీర్ అన్నాడు.

IPL 2017: Kolkata Captain Gautam Gambhir Says Heart Still Beats for Delhi Daredevils

'నేను నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ అయినప్పటికీ, ఆ జట్టు మరోసారి టైటిల్‌ గెలవాలని కోరుకుంటున్నా, ఢిల్లీ కుర్రాడిగా డేర్‌డెవిల్స్‌ కూడా మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటా'' అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. 2008 నుంచి 2010 వరకు గంభీర్ ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించాడు.

ఈ మూడు సీజన్లకు ఢిల్లీ తరుపున ఆడిన గంభీర్ 1097 పరుగులు సాధించాడు. 2011లో కోల్‌కతాకు మారాడు. అనంతరం గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా జట్టు 2012, 2014లో ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. ఇక కోల్ కతా తరుపున గంభీర్ ఇప్పటివరకు 2632 పరుగులు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+