Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2017: పంజాబ్ జట్టుకు సీఈఓగా సతీష్ మీనన్‌

హైదరాబాద్: సతీష్ మీనన్‌‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా, రాజీవ్ ఖన్నాను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా నియమిస్తూ ఆ జట్టు ప్రాంఛైజీ గురువారం నిర్ణయం తీసుకుంది. సతీష్ మీనన్‌కు మీడియా బిజినెస్ రంగంలో 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది.

స్పోర్ట్స్ మార్కెటింగ్, టెలివిజన్ తదితర రంగాల్లో ఉన్న ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంఛైజీ వెల్లడించింది. టాప్ బ్రాండ్స్ అయిన మిడ్-డే, జీ టీవీ, జీ న్యూస్, సహారా టెలివిజన్, టీవీ 18 (స్పోర్ట్ 18) లాంటి వాటికి హెడ్ ఆఫ్ బిజినెస్‌గా కూడా పనిచేశారు. స్వతహాగా లాయర్ అయిన రాజీవ్ ఖన్నాకు స్పోర్ట్స్ రంగంలో 16 ఏళ్ల అనుభవం ఉంది.

IPL 2017: Kings XI Punjab appoint Satish Menon as CEO

గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆపరేషన్స్‌ను నిర్వహించారు. ప్రస్తుతం రాజస్థాన్ గవర్నమెంట్‌కు స్పోర్ట్స్ విభాగంలో అడ్వైజర్‌గా కూడా వ్యవహారిస్తున్నారు. వీరిద్దరి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సీఈఓ, సీఓఓగా నియమించడం జరిగిందని కింగ్స్ ఎలెవెన్ యాజమాన్యం పేర్కొంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+