|
179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై
179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 97 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్ (17 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్) కోల్‌కతా స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు రాబట్టేందుకు తెగ ఇబ్బంది పడ్డాడు.
|
సంజయ్ మంజ్రేకర్ ఏమన్నాడు?
ఈ సమయంలో కామెంటేటర్‌గా ఉన్న సంజయ్ మంజ్రేకర్ ‘మైదానంలో పొలార్డ్ మతిలేకుండా ఆడుతున్నాడు' అంటూ వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాండ్యా 29, నితీశ్ రానా 50 పరుగులతో రాణించడంతో ముంబై ఒక బంతి మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
|
ట్విట్టర్లో పొలార్డ్ ఇలా
మ్యాచ్ అనంతరం ముంబై ఆటగాడు కీరన్ పొలార్డ్ ట్విట్టర్ వేదికగా సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలపై మండిపడ్డాడు. ‘మతిలేనివాడని అంటావా.. ఒకసారి నోరు జారితే మళ్లీ వెనక్కి తీసుకోలేం. నీ నోటి దురుసు తగ్గించుకుంటే బాగుంటుంది' అంటూ పోలార్డ్ హెచ్చరించాడు.
|
పొలార్డ్‌కు మద్దతుగా వెస్టిండిస్ బౌలర్ టినో బెస్ట్
పొలార్డ్‌కు మద్దతుగా వెస్టిండిస్ బౌలర్ టినో బెస్ట్ నిలిచాడు. తన ట్విట్టర్ ఖాతాలో పొలార్డ్‌ని మతిలేనివాడు అని ఎలా అంటావు? అని ప్రశ్నించాడు. అయితే పొలార్డ్ వ్యాఖ్యలకు మంజ్రేకర్ ఇంతవరకు స్పందించకపోవడం విశేషం. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే పుణె చేతిలో ఓడిన ముంబై జట్టుకు ఆదివారం రాత్రే తొలి విజయం లభించింది.