5వ ఆటగాడు: టీ20ల్లో 7000 పరుగుల క్లబ్‌లో పొలార్డ్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న కీరన్ పొలార్డ్ టీ20 ఫార్మెట్‌లో ఓ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. శుక్రవారం ముంబై-బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టు విజయంలో పొలార్డ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌కి ముందు 7000 పరుగుల మైలురాయిని అందుకునేందుకు పొలార్డ్ 33 పరుగుల దూరంలో ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో పొలార్డ్ అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు టీే20ల్లో ఏడు వేలకు పైగా పరుగులు సాధించిన ఆటగాళ్ల క్లబ్‌లో చేరాడు.

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగులు నమోదు చేయడంతో టీ20ల్లో ఏడు వేలకు పైగా పరుగులు సాధించిన ఐదో ఆటగాడిగా కీరన్ పొలార్డ్ నిలిచాడు. 362 మ్యాచ్‌ల్లో 325ఇన్నింగ్స్‌ల ద్వారా పొలార్డ్ ఈ ఘనతను అందుకున్నాడు.
టీ20 స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన పొలార్డ్ ప్రపంచ వ్యాప్తంగా అనేక లీగ్‌ల్లో పాల్గొన్నాడు. మరో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ 9997 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్రెండన్ మెకల్లమ్ (7,411), బ్రాడ్ హాడ్జ్ (7,338), డేవిడ్ వార్నర్ (7,011) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
టీ20 క్రికెట్‌లో 7000కు పైగా పరుగులు సాధించిన ఆటగాళ్లు వీరే:
1. క్రిస్ గేల్ : 9997 in 289 matches
2. బ్రెండన్ మెకల్లమ్: 7411 in 269 matches
3. బ్రాడ్ హాడ్జ్: 7338 in 270
4. డేవిడ్ వార్నర్: 7011 in 224
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications