ఐపీఎల్‌లో ముంబై విజయం: బట్టలు విప్పేసి టవల్‌తో డ్యాన్స్
హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన ఐపీఎల్ పదో సీజన్ పైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
అయితే ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ గెలుపొందడంతో ఆ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ ఆనందం కట్టలు తెగింది. దీంతో వినూత్నంగా సంబరాన్ని చేసుకున్నాడు. అంతేకాదు తన సంబరాలను ఇనిస్టాగ్రామ్‌లో పెట్టి అభిమానులతో పంచుకున్నాడు.

వివరాల్లోకి వెళితే ఆదివారం జరిగిన పైనల్ మ్యాచ్‌లో పూణెపై ఒక పరుగు తేడాతో ముంబై విజయం సాధించింది. దీంతో జోస్ బట్లర్ ఆనందంలో కట్టుకున్న టవల్‌ను విప్సేసి.. నగ్నంగా గంతులు వేశాడు. బాలీవుడ్ సినిమా సావరియాలో కూడా రణ్‌బీర్ సింగ్ ఇలానే ఎగరడం విశేషం.
దీంతో ఆ సన్నివేశాన్ని గుర్తుకుతెచ్చేలా బట్లర్ వేసిన నగ్న గంతుల వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. కాగా, ఐపీఎల్ పదో సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, చాంపియన్స్ ట్రోఫీ సన్నాహాల్లో పాల్గొనాల్సి ఉండటంతో అతను ఫైనల్‌కు ముందే ఇంగ్లాండ్ బయర్దేరాల్సి వచ్చింది.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కి అందుబాటులో లేకపోయినా ముంబై Vs పూణె ఫైనల్ మ్యాచ్‌ను టీవీలో వీక్షించి తనదైన స్టైల్‌లో జట్టు ఆనందంలో భాగస్వామిగా చేరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications