గుజరాత్‌కు మరో షాక్: ఐపీఎల్‌కు డ్వేన్ బ్రావో దూరం
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో వరుస ఓటములతో కుదేలవుతున్న గుజరాత్ లయన్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా లయన్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో మొత్తం ఐపీఎల్ టోర్నీనుంచే వైదొలిగాడు.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. 'డ్వేన్ బ్రావొ టోర్నీకి దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అతడు ఫిట్‌నెస్ సాధించడానికి మరికొన్ని వారాలు పడుతుంది. అతడి స్థానంలో ఎవరి తీసుకోవాలనే దానిపై మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతున్నాం' అని రైనా తెలిపాడు.

గత డిసెంబర్‌లో బిగ్ బాష్ లీగ్‌లో డ్వేన్ బ్రా వో గాయమైంది. ఆ తర్వాత బ్రావోకి జవవరిలో సర్జరీ జరిగింది. ఆ గాయం ఇంకా తగ్గక పోవడంతో టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్‌లో మంచి రికార్డు కలిగిన బ్రావొ దూరం కావడం గుజరాత్ లయన్స్‌కు ఎదురుదెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications