Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్‌లో: ఆర్‌సీబీ Vs సన్‌రైజర్స్

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 10వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్‌ని బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. ఏప్రిల్‌ 5 నుంచి మే 21 వరకు ఐపీఎల్‌ సందడి చేయనుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రన్నర్స్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది.

ఈ మ్యాచ్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఏప్రిల్‌ 5న జరగనుంది. ఇదే స్టేడియంలో మే 21న ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. దేశవ్యాప్తంగా 10 వేదికల్లో 47 రోజులపాటు మొత్తం 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ప్రతి జట్టు 14 మ్యాచ్‌లను ఇతర జట్లతో ఆడాల్సి ఉంటుంది.

అందులో 7 మ్యాచ్‌లు సొంత మైదానం ఆతిథ్యమిస్తుంది. క్వాలిఫయర్స్‌, ఎలిమినేటర్స్‌ వేదికలను ఇంకా నిర్ణయించలేదు. మరోవైపు కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ తమ రెండో హోమ్‌ గ్రౌండ్‌గా ఇండోర్‌ను ఎంపిక చేసుకుంది. దీంతో 2011 తర్వాత ఇండోర్‌లో మరోసారి ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనుండటం విశేషం.

IPL 2017: Hyderabad to host first game on April 5 against RCB

ధర్మశాల, రాయ్‌పూర్‌లకు మ్యాచ్‌లను షెడ్యూల్‌ చేయలేదు. 2017 ఐపీఎల్‌ కోసం ఫిబ్రవరి 20వ తేదీన బెంగళూరులో ఆటగాళ్ల వేలం జరగనుంది. రూ.2 కోట్ల నుంచి రూ. 10 లక్షల మధ్య కనీస విలువతో వేలం కోసం మొత్తం 351 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌:
తేదీ వేదిక ఎవరితో ఎవరు
ఏప్రిల్‌ 5 హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ Vs ఆర్‌సీబీ
ఏప్రిల్‌ 9 హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ Vs గుజరాత్
ఏప్రిల్‌ 12 ముంబై సన్‌రైజర్స్‌ Vs ముంబై
ఏప్రిల్‌ 15 కోల్‌కతా సన్‌రైజర్స్‌ Vs కేకేఆర్‌
ఏప్రిల్‌ 17 హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ Vs పంజాబ్‌
ఏప్రిల్‌ 19 హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ Vs ఢిల్లీ
ఏప్రిల్‌ 22 పుణె సన్‌రైజర్స్‌ Vs పుణె
ఏప్రిల్‌ 25 బెంగళూరు సన్‌రైజర్స్‌ Vs ఆర్‌సీబీ
ఏప్రిల్‌ 28 మొహాలీ సన్‌రైజర్స్‌ Vs పంజాబ్‌
ఏప్రిల్‌ 30 హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ Vs కేకేఆర్‌
మే 2 ఢిల్లీ సన్‌రైజర్స్‌ Vs ఢిల్లీ
మే 6 హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ Vs పుణె
మే 8 హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ Vs ముంబై
మే 13 కాన్పూర్‌ సన్‌రైజర్స్‌ Vs గుజరాత్

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+