హైదరాబాద్: ఇండియన్స్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. భుజం నొప్పి గాయం నుంచి పూర్తిగా కోలుకున్న కోహ్లీ ఐపీఎల్ పదో సీజన్‌లో ఆడేందుకు ఎంతో ఆతృతగా ఉన్నానని చెప్పాడు.
బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో ముంబైతో జరిగే మ్యాచ్‌లో బిగ్ షాట్స్ ఆడేందుకు ప్రయత్నిస్తానని కోహ్లీ చెప్పాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరిస్ సందర్భంగా రాంచీ టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా కోహ్లీ భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు ధర్మశాలలో జరిగిన నాలుగో టెస్టుకు దూరమయ్యాడు.
అయినా సరే రహానే నేతృత్వంలోని టీమిండియా ధర్మశాల టెస్టులో విజయం సాధించడంతో టెస్టు సిరిస్‌ను 2-1తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో '120 శాతం ఫిట్‌నెస్ ఉంటేనే ఐపీఎల్‌లో ఆడతాను' అని కోహ్లీ ఐపీఎల్ కు ముందు ప్రకటించాడు. దీంతో ఐపీఎల్ 10వ సీజన్ ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీ ఫిటెనెస్ సాధించలేకపోయాడు.

దీంతో ఐపీఎల్ 10వ సీజన్‌లో బెంగళూరు ఆడిన తొలి మూడు మ్యాచ్‌లకు కోహ్లీ దూరంగా ఉన్నాడు. అయితే భుజం గాయం నుంచి విరాట్ కోహ్లీ పూర్తిగా కోలుకున్నట్లు నిర్ధారించిన బీసీసీఐ అతన్ని ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతించింది.
'బీసీసీఐ మెడికల్ టీమ్ కోహ్లీని పరిశీలించి అతను మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించినట్లు నిర్ధారించింది. ముంబైతో శుక్రవారం బెంగళూరులో జరిగే మ్యాచ్‌లో అతను ఆడొచ్చు. కోహ్లీ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు' అని బీసీసీఐ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో బెంగళూరు ఒకదాంట్లో విజయం సాధించి, రెండింటిలో ఓటమి పాలైంది. ప్రస్తుతం బెంగళూరు జట్టుకి తాత్కాలిక కెప్టెన్‌గా షేన్ వాట్సన్ ఉన్న సంగతి తెలిసిందే. ఏబీ డివిలియర్స్‌తో పాటు తాను కూడా పునరాగమనం చేస్తున్న నేపథ్యంలో బెంగళూరు ఆటలో మార్పు వస్తుందని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
'నేను కూడా వచ్చేస్తున్నాను కాబట్టి స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ అందరూ జట్టులో ఉన్నట్లే. కాబట్టి మా జట్టు ఆటలో మార్పు ఉంటుందని భావిస్తున్నా. సొంతగడ్డపై మేం ఎప్పుడూ బాగానే ఆడతాం. గత ఏడాది ఇక్కడ చక్కటి విజయాలు సాధించాం. మేం ప్లేఆఫ్ చేరాలంటే ఏకాగ్రతతో ఆడాలి' అని కోహ్లీ చెప్పాడు.
కోహ్లీ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో కూడా క్రిస్ గేల్‌పై వేటు తప్పదేమో అనిపిస్తోంది. ముంబైతో జరిగే మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, తైమాల్ మిల్స్, బిల్లీ స్టాన్ లేక్‌లతో బెంగళూరు జట్టు బరిలోకి దిగనుంది.
శుక్రవారం ముంబైతో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఇలా(అంచనా):
1. విరాట్ కోహ్లీ (కెప్టెన్)
2. మన్దీప్ సింగ్
3. ఏబీ డివిలియర్స్
4. కేదార్ జాదవ్ (వికెట్ కీపర్)
5. షేన్ వాట్సన్
6. స్టువర్ట్ బిన్నీ
7. పవన్ నెగి
8. తైమాల్ మిల్స్
9. శ్రీనాథ్ అరవింద్
10. బిల్లీ స్టాన్ లేక్
11. యజువేంద్ర చాహాల్
జట్ల వివరాలు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
Virat Kohli (captain), Shane Watson, Chris Gayle, Mandeep Singh, Kedar Jadhav (wicketkeeper), Travis Head, Sachin Baby, Stuart Binny, Tymal Mills, Sreenath Aravind, Aniket Choudhary, Yuzvendra Chahal, Pawan Negi, Harshal Patel, Adam Milne, Iqbal Abdulla, Samuel Badree, Avesh Khan, Tabraiz Shamsi, Praveen Dubey, Billy Stanlake.
ముంబై ఇండియన్స్:
Rohit Sharma (captain), Parthiv Patel (wicketkeeper), Kieron Pollard, Tim Southee, Jos Buttler (wicketkeeper), Ambati Rayudu, Mitchell McClenaghan, Nitish Rana, Jasprit Bumrah, Hardik Pandya, Krunal Pandya, Harbhajan Singh, Mitchell Johnson, Lendl Simmons, Vinay Kumar, Saurabh Tiwary, Karn Sharma, Krishnappa Gowtham, Siddhesh Lad, Nicholas Pooran, Shreyas Gopal, Jitesh Sharma, Deepak Punia, Jagadeesha Suchith, Kulwant Khejroliya.
మ్యాచ్ ఆరంభం
సాయంత్రం 4 PM IST - LIVE on Sony SIX, Sony Max, Sony ESPN
రాత్రి 8 PM IST - Gujarat Vs Pune in Rajkot
శనివారం మ్యాచ్‌లు (April 15)
Kolkata Vs Hyderabad (Kolkata) - 4 PM IST Delhi Vs Punjab (Delhi) - 8 PM IST
బెంగళూరు తదుపరి మ్యాచ్ - Vs Pune in Bengaluru on April 16 (Sunday) - 8 PM IST
ముంబై తదుపరి మ్యాచ్ - Vs Gujarat in Mumbai on April 16 - 4 PM IST