Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: హ్యాట్రిక్ హీరో ఆండ్రూ టై ఫస్ట్ లవ్ ఏంటో తెలుసా?

హైదరాబాద్: ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన తొలిమ్యాచ్‌లోనే హ్యాట్రిక్‌ వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. శుక్రవారం రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగులకే ఐదు వికెట్లు తీసిన ఆండ్రూ టై ఐపీఎల్‌లో అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు.

ఇన్నింగ్స్‌ 20వ ఓవర్ వేసిన ఆండ్రూ టై తొలి మూడు బంతులకు వరుసగా అంకిత్‌ శర్మ, మనోజ్‌ తివారి, శార్దుల్‌ ఠాకూర్‌లను అవుట్‌ చేసి హ్యాట్రిక్‌ సాధించాడు. ఈ సందర్భంగా తనకు టెస్టు క్రికెట్‌ ఆడటమంటేనే ఇష్టమని, అదే తన ఫస్ట్‌ లవ్‌ అని మ్యాచ్ అనంతరం ఆండ్రూ టై మీడియాతో చెప్పాడు.

'ఇది (టీ20) క్రికెట్‌లో మంచి ఫార్మెటే. కానీ టెస్టు క్రికెట్‌ ఆడటమే నాకు ఇష్టం. స్లోవర్‌ బాల్‌ పిచ్‌ చాలా బాగా ఉపయోగపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిచ్‌లు వేటికవే భిన్నంగా ఉంటాయి. అక్కడి పరిస్థితులను అర్థం చేసుకొని ఎలా బౌలింగ్‌ చేయాలో అంచనా వేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు' అని ఆండ్రూ తెలిపాడు.

30 ఏళ్ల ఆండ్రూ టై ఐపీఎల్‌లో అరంగేట్రం మ్యాచ్ కోసం 30 మ్యాచ్‌లకు పైగా ఎదురుచూశాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలు కావడవంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌లో గుజరాత్‌ జట్టులో స్వల్ప మార్పులు చేసింది. దీంతో తుది జట్టులో ఆండ్రూ టైకి చోటు లభించింది.

తనకు వచ్చిన అవకాశాన్ని ఆండ్రూ టై చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. నాలుగు ఓవర్లలో 17 పరుగులిచ్చి హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్లు తీశాడు. దీంతో పూణెపై గుజరాత్‌ లయన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీలో తొలి విజయాన్ని సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+