హైదరాబాద్: ఐపీఎల్ చరిత్రలోనే పదో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శనపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ సీజన్‌లో 13 మ్యాచ్ లాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం రెండు మ్యాచ్‌ల్లో గెలిచి పదింట్లో ఓటమి పాలైంది.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచింది. టోర్నీలో ఆదివారం (మే 14)న ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో చివరి మ్యాచ్ ఆడనుంది. ఐపీల్ పదో సీజన్‌లో ఆటగాళ్లగా అది తమను ఎంతో బాధించిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు.

ఒక జట్టు వరుస ఓటములు ఎదుర్కొంటున్నప్పుడు ఆ బాధ, నిరుత్సాహం నుంచి బయటపడటం చాలా కష్టమని అన్నాడు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి తాము ఎంతో ప్రయత్నించామని కానీ అలా జరగలేదని గురువారం ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో మాట్లాడుతూ కోహ్లీ చెప్పాడు.
కొన్నిసార్లు ఇలానే జరుగుతుందని, గతేడాది మాత్రం తమకు బాగా కలిసొచ్చినప్పటికీ ఈసారి అందుకు భిన్నంగా జరిగిందని అన్నాడు. అయితే దాన్ని అంగీకరించి ముందుకు సాగిపోవాలని కోహ్లీ చెప్పాడు. పదో సీజన్‌లో బెంగళూరు స్టార్ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ విఫలమైన సంగతి తెలిసిందే.