Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2017: ఎందుకంత కోపం, ధోనిపై మరోసారి అక్కసు?

హైదరాబాద్: రైజింగ్ పూణె సూపర్ జెయింట్ ప్రాంఛైజీ యజమాని సంజీవ్‌ గోయాంకా సోదరుడు హర్ష గోయాంకా మరోసారి ధోనిపై తన అక్కసు వెళ్లగక్కాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా పూణె ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌‌తో తలపడింది.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ స్టీవ్ స్మిత్‌ (84 నాటౌట్‌)తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో హర్ష గోయాంకా తన ట్విటర్‌లో 'అడవికి రాజు ఎవరో తెలిసిపోయింది. స్మిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పూణెకు స్మిత్‌ను కెప్టెన్‌గా ఎంచుకోవడం మంచి నిర్ణయమే' అని ట్వీట్ చేశాడు.

దీంతో ధోని అభిమానులు సోషల్ మీడియా వేదికగా గోయాంకాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో 'అతను తిరిగి ఫామ్‌ను తిరిగి అందుకోవడం ఆనందంగా ఉంది. అతని కంటే ఉత్తమ ఫినిషర్‌ ఎవరూ ఉండరు' అని ధోనిని పొగుడుతూ ట్వీట్‌ చేశాడు.

అడవికి నిజమైన రాజు ఎవరో తెలిసిందా?

అడవికి నిజమైన రాజు ఎవరో తెలిసిందా?

ఈ ట్వీట్‌కు ధోని అభిమానులు అడవికి నిజమైన రాజు ఎవరో తెలిసిందా? అంటూ హర్ష గోయాంకాకి చురకలంటించారు. తాజాగా బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్‌లో పూణె 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ధోనిపై మరోసారి అక్కసు

ధోనిపై మరోసారి అక్కసు

దీంతో మరోసారి హర్ష గోయాంకా ట్విట్టర్ వేదికగా పరోక్షంగా ధోనిపై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. ఈ మ్యాచ్‌లో పూణె యువ ఆటగాడు 52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.

ప్రతి మ్యాచ్‌లో పుణె తరఫున ఓ కొత్త ఆటగాడు

దీంతో 'ప్రతి మ్యాచ్‌లో పుణె తరఫున ఓ కొత్త ఆటగాడు వెలుగులోకి వస్తున్నాడు. ఇది పుణె జట్టుకు ఎంతో కలిసొచ్చే అంశం' అని త్రిపాఠి, స్టోక్స్‌, స్మిత్‌, తాహీర్‌ పేర్లను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు. ఈ నలుగురు కూడా ఇప్పటివరకు పూణె సాధించిన మ్యాచ్‌ల్లో కీలకపాత్ర పోషించారు.

ధోని పేరుని ప్రస్తావించని హర్ష గోయాంకా

ధోని పేరుని ప్రస్తావించని హర్ష గోయాంకా

ఇదిలా ఉంటే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పుణె విజయానికి కారణమైన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరుని మాత్రం ప్రస్తావించడం మరచిపోయాడు. దీంతో ధోని అభిమానులు హర్ష గోయాంకా తాజా ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+