హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో భాగంగా టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లు మ్యాచ్‌ల కోసం బస్సు, విమాన ప్రయాణాల ద్వారా మ్యాచ్‌లు జరిగే ప్రదేశాలకు చేరుకుంటున్నారు. అయితే గత వారం ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు వెళ్తోన్న బస్సు మధ్యలో ఆగింది.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
అయితే ఆ బస్సు ఎందుకు ఆగిందో బస్సులోని ఆటగాళ్లకు అర్ధం కాలేదు. అయితే ఆ తర్వాత బస్సు ఎందుకు ఆగిందో కారణాన్ని తెలుసుకున్న ఆటగాళ్లు అవాక్కయ్యారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సోథీ.

ఈ నేపథ్యంలో ఆటగాళ్లు బస్సులో వెళ్తుండగా మార్గం మధ్యలో సోథీ సిబ్బందిని బస్సు ఆపాల్సిందిగా కోరాడు. ఎందుకంటే అతను టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చింది. దీంతో సిబ్బంది వెంటనే బస్సును ఆపడంతో అందుబాటులో ఉన్న వాష్ రూమ్‌కి వెళ్లి తిరిగొచ్చి బస్సు ఎక్కాడు.
ఇదే సమయంలో బస్సులో ఉన్న టీమిండియా వెటరన్ ఆటగాడు హర్భజన్ సింగ్ ఈ తతంగాన్నంతా వీడియో తీయడం ప్రారంభించాడు. 'టిమ్మి పరిగెత్తు... లేకపోతే మరో సమస్య రావొచ్చు' అంటూ భజ్జీ సలహా ఇచ్చాడు. అంతేకాదు సోథీ ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికైనా తెలుసా? అంటూ సహచర ఆటగాళ్లను ప్రశ్నించాడు.
దీంతో బస్సులోని మిగతా ఆటగాళ్లంతా పడి పడి నవ్వారు. సోథీ వాష్ రూమ్‌కి వెళ్లి పని పూర్తి చేసుకుని తిరిగి బస్సే ఎక్కేందుకు వరకు వీడియోని చిత్రీకరించాడు భజ్జీ. 'ఇప్పుడెలా ఉంది టిమ్మి. అంతా బాగానే ఉంది కదా' అని భజ్జీ అడగ్గా 'అంతా ఓకే అంటూ' టిమ్మి సమాధానమిచ్చాడు. ఈ వీడియోని భజ్జీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.