Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20ల్లో 200 వికెట్లు: హర్భజన్ అరుదైన ఘనత

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ మరో ఘనత సాధించాడు. టీ20ల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. టోర్నీలో భాగంగా సోమవారం ముంబైలోని వాంఖడే మైదానంలో రైజింగ్‌ పూణెతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈ మ్యాచ్‌‌లో స్టీవ్‌ స్మిత్ వికెట్‌ తీయడం ద్వారా అతను 200వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో వికెట్ల మైలురాయిని అందుకున్న మూడో బౌలర్‌గా భజ్జీ నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా టీ20ల్లో 200 వికెట్లు తీసిన 19వ బౌలర్‌గా నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో అమిత్‌ మిశ్రా (208), రవిచంద్రన్‌ అశ్విన్‌ (200) ఉన్నారు.

IPL 2017: Harbhajan Singh Becomes Third Indian To Take 200 Wickets In T20 Cricket

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హర్భజన్ సింగ్ 132 మ్యాచ్‌లు ఆడి 123 వికెట్లు తీసుకున్నాడు. 225 మ్యాచ్‌ల్లో 214 ఇన్నింగ్సుల ద్వారా భజ్జీ ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్‌ ఆటగాడు డ్వేన్‌ బ్రావో 367 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

'నాకు టీ20 వికెట్లు ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు. వెటరన్‌ బౌలర్‌ కూడా ఏదోక రోజు యువ బౌలర్‌లా సత్తా చాడతాడని ఈరోజు నిరూపితమైంది' అని హర్భజన్‌ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. భారత్‌ తరఫున హర్భజన్ చివరిసారిగా టీ20 ఆసియా కప్‌ 2016లో యూఏఈపై ఆడాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+