Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంఫైర్‌పై అరవలేదు: అసలేం జరిగిందంటే?, భజ్జీ వివరణ

హైదరాబాద్: సోమవారం పూణెతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అంఫైర్‌పై అరవలేదని, దురుసుగా ప్రవర్తించలేదని వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. పూణెతో జరిగిన మ్యాచ్‌లో అంఫైర్‌పై వాగ్వాదానికి దిగినందుకు గాను రోహిత్ శర్మ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పూణె నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు 160 పరుగులు సాధించింది. 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి చివరి ఓవర్లో 17 పరుగులు అవసరమైనప్పుడు రోహిత్ శర్మ క్రీజులో ఉన్నాడు. తొలి బంతికి హార్దిక్‌ పాండ్యా అవుటయ్యాడు. రెండో బంతికి రోహిత్‌ సిక్సర్‌ బాదాడు.

పూణె VS ముంబై స్కోరు కార్డు

ఈ క్రమంలో మూడో బంతికి రోహిత్‌ ఆఫ్‌ వికెట్‌ వైపు జరగ్గా.. ఉనాద్కత్‌ బంతిని బాగా ఎడంగా వేశాడు. ఉనాద్కత్ వేసిన బంతి వైడ్ వెళ్లినా అంపైర్ ఇవ్వలేదని అంపైర్ ఎస్.రవితో వాగ్వాదానికి దిగాడు. నేరుగా ఎంపైర్ వద్దకు వెళ్లి ఆ బంతి వైడ్ ఎందుకు ఇవ్వలేదని వాదించాడు.

IPL 2017: Harbhajan defends Rohit, says MI captain did not shout at umpire

అప్పుడు రోహిత్‌ అంపైర్‌తో వాగ్వాదానికి దిగలేదని కేవలం నిబంధనలు గురించి మాత్రమే తెలియజేసేందుకు ప్రయత్నించాడని భజ్జీ వెల్లడించాడు. 'వాస్తవంగా బంతి చాలా ఎడంగా వెళ్లింది. ఐతే అది వైడో కాదో తెలీదు. బ్యాట్స్‌మన్‌ రెండు కాళ్లూ జరిపితే బౌలర్‌కే అనుకూలం. కానీ రోహిత్‌ ఒక్కకాలే కదిపాడు. నా అంచనా మేరకు అది వైడ్‌. ఐతే మనం అంపైర్‌ నిర్ణయం ప్రకారమే వెళ్లాల్సి ఉంటుంది' అని భజ్జీ అన్నాడు.

దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంగించినందుకు అతడి మ్యాచ్‌లో 50 శాతం కోత విధించారు. అంపైర్‌తో వాగ్వాదంతో రోహిత్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో లెవల్‌-1 ఆర్టికల్‌ 2.1.5 నియమావళిని రెండోసారి అతిక్రమించినట్లైంది. దీంతో రోహిత్‌ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించినట్లు ఐపీఎల్‌ నిర్వాహక కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+