Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆమ్లా సెంచరీ చేసినా: పంజాబ్‌పై గుజరాత్ విజయం

హైదరాబాద్: అనూహ్యంగా ప్లే ఆఫ్ రేసులోకి దూసుకొచ్చిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కీలక మ్యాచ్‌లో ఓటమి పాలైంది. జట్టు ఓపెనర్ హషీమ్ ఆమ్లా (60 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ చేసినా.. పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్‌తో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.

దీంతో ఆదివారం మొహాలీలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఆమ్లా ఈ సీజన్‌లో రెండో సెంచరీ చేయగా, షాన్ మార్ష్ (43 బంతుల్లో 58; 6 ఫోర్లు) అద్భుత ప్రదర్శన చేశాడు.

అనంతరం 190 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్ (39 బంతుల్లో 74; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 29; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు.

పవర్‌ప్లేలో 58 పరుగులు చేసిన గుజరాత్

పవర్‌ప్లేలో 58 పరుగులు చేసిన గుజరాత్

పవర్‌ప్లేలో 58 పరుగులు చేసిన గుజరాత్ లయన్స్ 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. 12వ ఓవర్‌లో డ్వేన్ స్మిత్ అవుట్ కావడంతో కెప్టెన్ రైనా (25 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి ఇన్నింగ్స్‌ను ఆడి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఆఖర్లో ఉత్కంఠ

ఆఖర్లో ఉత్కంఠ

ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 42 పరుగులు జత చేశారు. ఆఖర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నా పంజాబ్ బౌలింగ్ అనుభవలేమిని అనుకూలంగా మార్చుకున్న కార్తీక్, జడేజా (7 నాటౌట్) ఐదో వికెట్‌కు అజేయంగా 27 పరుగులు జత చేసి జట్టును గెలిపించారు. డ్వేన్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

10 ఓవర్లలో పంజాబ్ 81

10 ఓవర్లలో పంజాబ్ 81

అంతక ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఇన్నింగ్స్ ఐదో బంతికే గప్టిల్ (2) వికెట్‌ను కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన మార్ష్.. ఆమ్లాతో కలిసి నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో పవర్‌ప్లేలో పంజాబ్‌కు 44 పరుగులు వచ్చాయి. స్పిన్నర్ల బౌలింగ్‌లో 8 పరుగుల రన్‌రేట్ సాధించడంతో తొలి 10 ఓవర్లలో మ్యాక్స్‌సేన 81 పరుగులకు చేరింది.

భారీ సిక్సర్‌తో ఆమ్లా అర్ధ సెంచరీ

భారీ సిక్సర్‌తో ఆమ్లా అర్ధ సెంచరీ

13వ ఓవర్‌లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ఆమ్లా భారీ సిక్సర్ బాదగా, తర్వాతి ఓవర్‌లో మార్ష్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని 16వ ఓవర్‌లో మార్ష్‌ను ఔట్ చేయడం ద్వారా కులకర్ణి విడగొట్టాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించారు.

ఆమ్లా అద్భుత ఇన్నింగ్స్

ఆమ్లా అద్భుత ఇన్నింగ్స్

తర్వాత ఆమ్లా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఎదుర్కొన్న ఏడు బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదగా, 19వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ (11 బంతుల్లో 20 నాటౌట్; 2 సిక్సర్లు) రెండు సిక్సర్లతో 16 పరుగులు రాబట్టాడు. మ్యాక్స్‌తో మూడో వికెట్‌కు 60 పరుగులు జత చేసిన ఆమ్లా ఆఖరి ఓవర్‌లో ఔటయ్యాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+