ఐపీఎల్: విజయ్‌ను తప్పించి మ్యాక్స్‌వెల్‌కు పంజాబ్ కెప్టెన్సీ పగ్గాలు
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ ఎడిషన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ నియమితుడయ్యాడు. ఈ మేరకు పంజాబ్ ప్రాంఛైజీ తన అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. ఐపీఎల్ 9వ సీజన్‌లో కెప్టెన్‌గా ఉన్న మురళీ విజయ్‌ని తప్పించి అతడి స్ధానంలో మ్యాక్స్‌వెల్ కెప్టెన్‌గా నియమించింది.
దీంతో పదో సీజన్‌లో మురళీ విజయ్ ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. 'బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అతడి ఫైర్‌ని చూశాం. ఈసారి అతడిలో ఉన్న కెప్టెన్‌ను చూద్దాం' అని పంజాబ్ ప్రాంచైజీ ట్వీట్ చేసింది.
మ్యాక్స్‌వెల్‌కే ప్రాధాన్యత
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, వెస్టిండీస్ ట్వంటీ20 మాజీ కెప్టెన్ డారెన్ సామీ, దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు హషీమ్ ఆమ్లాలు ఉన్నప్పటికీ మ్యాక్స్‌వెల్‌నే కెప్టెన్‌గా నియమిస్తూ పంజాబ్ ప్రాంఛైజీ నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్‌లో 3కు చేరిన ఆసీస్ ఆటగాళ్ల కెప్టెన్ల సంఖ్య
తాజా నిర్ణయంతో ఐపీఎల్ 10వ సీజన్‌లో కెప్టెన్లగా వ్యవహారించే ఆస్ట్రేలియా ఆటగాళ్ల సంఖ్య మూడుకు చేరింది. గత కొన్ని రోజుల క్రితం పూణె సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ధోనిని తప్పించి అతడి స్ధానంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను నియమించిన సంగతి తెలిసిందే.

తొలుత ఢిల్లీ జట్టు తరుపున ఆడిన మ్యాక్స్‌వెల్
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ గతేడాది బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాక్స్ వెల్ విషయానికి వస్తే ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న ఆటగాళ్లలో ఒకడు. ఐపీఎల్‌లో తొలుతు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరుపున ఆడిన అతడు ఆ తర్వాత ముంబై ఇండియన్స్ తరుపున ఆడాడు.

మ్యాక్స్‌వెల్ సారథ్యంలో పంజాబ్ జట్టు
2013 ఐపీఎల్ వేలం పాటలో పంజాబ్ ప్రాంఛైజీ మ్యాక్స్ వెల్‌ను రూ. 10 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పంజాబ్ ఫ్రాంచైజీతోనే కొనసాగుతున్నాడు. తాజాగా కెప్టెన్సీని సైతం కట్టబెట్టింది. మ్యాక్స్‌వెల్ సారథ్యంలో పంజాబ్ జట్టు రాణిస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications