For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌: వార్నర్ సరసన గంభీర్, సరికొత్త రికార్డు

ఇండియన ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 49 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఇండియన ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. టోర్నీలో భాగంగా గురువారం రాత్రి కోల్‌కతా Vs పంజాబ్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గంభీర్ తన కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో గంభీర్ 49 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో 33వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన గంభీర్‌ ఐపీఎల్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన డేవిడ్‌ వార్నర్‌ రికార్డుని సమం చేశాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్ 103 మ్యాచ్‌ల్లో 33 అర్ధ సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు. తాజాగా వార్నర్‌ సరసన గౌతమ్‌ గంభీర్‌ నిలిచాడు. 135 మ్యాచ్‌ల్లో 134 ఇన్నింగ్స్‌ల ద్వారా గంభీర్ 33 అర్ధసెంచరీలు నమోదు చేశాడు.

IPL 2017: Gautam Gambhir Equals David Warner's Feat

ఈ ఇద్దరూ గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరుపున ఆడారు. వీరిద్దరి తర్వాత రోహిత్‌ శర్మ(29), సురేశ్‌ రైనా(29), విరాట్‌ కోహ్లీ(26), అజ్యింకె రహానె(24)లు ఉన్నారు. ఇదిలా ఉంటే గురువారం నాటి మ్యాచ్‌లో 171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 16.4 ఓవర్లలోనే విజయం సాధించింది.

ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే:
David Warner (Delhi Daredevils, Sunrisers Hyderabad) - 33
Gautam Gambhir (Delhi Daredevils, Kolkata Knight Riders) - 33
Rohit Sharma (Deccan Chargers, Mumbai Indians) - 29
Virat Kohli (Royal Challengers Bangalore) - 26
Suresh Raina (Chennai Super Kings, Gujarat Lions) - 29
Ajinkya Rahane ((Mumbai Indians, Rajasthan Royals, Rising Pune Supergiant)- 24

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+