Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతడి పాత్ర వెలకట్టలేనిది: మాయ చేస్తాడని ముందే తెలుసన్న సచిన్

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌ ఉత్కంఠ ఫైనల్‌తో ఆదివారం రాత్రి ముగిసింది. ఫైనల్‌లో ముంబై పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో ఫైనల్లో ముంబై ఇండియన్స్ 130 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించింది.

రైజింగ్ పుణె‌ సూపర్ జెయింట్‌పై ఒక పరుగు తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించి ముచ్చటగా మూడో సారి టైటిల్‌ని చేజిక్కించుకుంది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె ఒకానొక దశలో 71/1తో నిలిచి అలవోకగా విజయం సాధించేలా కనిపించింది.

చివర్లో ఒత్తిడికి తలొగ్గిన ఆ జట్టు వరుసగా వికెట్లు చేజార్చుకుని ఓటమిపాలైంది. ఐపీఎల్ టైటిల్ సాధించడంలో ముంబై ఇండియన్స్ పేసర్లు ప్రధాన పాత్ర పోషించారు. జస్ప్రిత్ బూమ్రా, లసిత్ మలింగా, మిచెల్ జాన్సన్‌లు తమ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించి విజయాన్నందించారు.

చివరి మూడు ఓవర్లే కీలకం

చివరి మూడు ఓవర్లే కీలకం

చివరి మూడు ఓవర్లలో పుణె విజయానికి 30 పరుగులు అవసరం కాగా.. యార్కర్ల మలింగకి రోహిత్ శర్మ బంతినిచ్చాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న స్టీవ్‌స్మిత్ తికమక పుట్‌వర్క్‌తో మలింగ లయని దెబ్బతీసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది.

మలింగ యార్కర్లకు స్మిత్ బెంబేలు

మలింగ యార్కర్లకు స్మిత్ బెంబేలు

ఆ ఓవర్‌లో వరుసగా స్మిత్ కాళ్ల వద్ద యార్కర్లు విసిరిన మలింగ కేవలం 7 పరుగులే ఇచ్చాడు. దీంతో చివరి రెండు ఓవర్లలో పూణె విజయానికి 23 పరుగులు అవసరమయ్యాయి. ఇలా చివర్లో పూణె బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడంలో సఫలమైన మలింగపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.

ముంబై జట్టులో మలింగా పాత్ర వెలకట్టలేనిది

ముంబై జట్టులో మలింగా పాత్ర వెలకట్టలేనిది

'ముంబై జట్టులో మలింగా పాత్ర వెలకట్టలేనిది. గత కొన్నేళ్లుగా మలింగా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. పుణె‌తో ఫైనల్లో కూడా అతను తప్పకుండా మాయ చేస్తాడని నేను విశ్వసించాను. ఒక ఓవర్‌లో పూర్తిగా పరిస్థితుల్ని మార్చేసి శక్తి మలింగకు ఉంది. ఆ అంచనాల్ని అందుకుని ముంబై టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు' అని సచిన్ ప్రశంసించాడు

కోచ్ మహేలా జయవర్ధనే పాత్ర అమోఘం

కోచ్ మహేలా జయవర్ధనే పాత్ర అమోఘం

మరోవైపు జట్టు విజయంలో కోచ్ మహేలా జయవర్ధనే పాత్ర అమోఘమని సచిన్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఓ మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థికి నిర్దేశించిన తరుణంలో జయవర్ధనే ఆటగాళ్లలో ధైర్యం నింపిన తీరు అమోఘం కొనియాడాడు. మ్యాచ్ తొలి అర్ధభాగంలో ముంబైకి గట్టి ఎదురుదెబ్బలు తగిలినా మళ్లీ పుంజుకుందని అన్నాడు.

ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకం కోల్పోకూడదు

ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకం కోల్పోకూడదు

ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకం కోల్పోకుండా ఉంటే విజయం వరిస్తుందని చెప్పడంతో పాటు ఒకసారి ఛాంపియన్ ఎప్పుడూ ఛాంపియన్ అనేది గుర్తించుకుని పోరాడాలంటూ జయవర్దనే ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసిన విధానం చాలా బాగుందని సచిన్ కొనియాడాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+