హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన పైనల్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో పూణెపై ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
తద్వారా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుని ఐపీఎల్ టైటిల్ మూడుసార్లు అందుకున్న తొలి జట్టుగా కొత్త చరిత్ర సృష్టించింది. పదో సీజన్‌లో టోర్నీ ఆద్యంతం నిలకడను ప్రదర్శించిన ముంబై ఇండియన్స్ తుది పోరులో సైతం సత్తా చాటుకుని మరోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది.
దీంతో ట్రోఫీ అందుకోగానే ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఇదిలా ఉంటే ట్రోఫీని సోమవారం ఉదయం ముంబై ఇండియన్స్ ప్రాంఛైజీ నగరంలోని శ్రీ సిద్ధి వినాయక గణపతి ఆలయానికి తీసుకెళ్లింది. స్వామివారి ఆశీర్వాదాలు అందుకొంది. మరోవైపు ఐపీఎల్ ట్రోఫీని ఒక్కో ఆటగాడు ఒక్కోలా ఆస్వాదించాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన్మయత్వానికి లోనవుతూ ట్రోఫీని గాల్లోకి ఎత్తి ముద్దు పెట్టుకున్నాడు. ఇక ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పాండ్యా సోదరులు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి తమ ఆనందం పంచుకున్నారు.