Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 10 విజేత ముంబై: పూణెపై ఒక పరుగు తేడాతో విజయం

హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన ఐపీఎల్ పదో సీజన్ పైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.

 Mumbai Indians

తద్వారా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుని ఐపీఎల్ టైటిల్ మూడుసార్లు అందుకున్న తొలి జట్టుగా కొత్త చరిత్ర సృష్టించింది. పదో సీజన్‌లో టోర్నీ ఆద్యంతం నిలకడను ప్రదర్శించిన ముంబై ఇండియన్స్ తుది పోరులో సైతం సత్తా చాటుకుని మరోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది.

మరోవైపు గెలుపు అంచువరకు వచ్చిన పూణె చివర్లో చతికిల పడింది. 130 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె చివర్లో ఒత్తిడికి గురై వికెట్లను చేజార్చుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి ఓటమి పాలైంది. చివరి ఓవర్‌లో పూణె విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి.

 Mumbai Indians

దీంతో చివరి ఓవర్‌ను ముంబై బౌలర్ మిచెల్ జాన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 9 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా రెండు పరుగులు మాత్రమే చేశారు. అయితే మూడు పరుగు కోసం ప్రయత్నించిన క్రమంలో వాషింగ్టన్ సుందర్ రనౌట్ అయ్యాడు. లేకుంటే మ్యాచ్ డ్రాగా ముగిసేది.

పూణె ఆటగాళ్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ 51, రహానే 44 పరుగులతో రాణించినా జట్టుని విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఈ విజయంతో ఈ సీజన్‌లో లీగ్‌ దశలో రెండు సార్లు.. ప్లేఆఫ్‌లో ఒకసారి ఓటమి పాలైన ముంబై... పూణెను ఓడించి మొత్తం లెక్కను ఒకేసారి సరి చేసినట్లు అయింది.

పూణె విజయ లక్ష్యం 130

హైదరాబాద్ వేదికగా రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్ మెన్ నిరాశపరిచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ పూణె బౌలర్లు ఉనాద్కత్ (2/11), ఆడమ్ జంపా (32/2) ధాటికి ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.

దీంతో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ విజయ లక్ష్యం 130 పరుగులుగా నిర్దేశించింది. కృనాల్ పాండ్యా (38 బంతుల్లో 47; 3x4, 2x6), రోహిత్ శర్మ (22 బంతుల్లో 24; 4x4) మాత్రమే ముంబై జట్టులో చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ (4), సిమన్స్ (3)లను ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే పెవిలియన్‌కి పంపి జయదేవ్ ఆదిలోనే ముంబైకి షాకిచ్చాడు.

Mumbai Indians have won the toss and have opted to bat

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (12) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఈ దశలో కృనాల్‌ పాండ్యాతో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ నిలకడగా ఆడాడు. ఈ క్రమంలో ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కి యత్నించి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ముంబై కష్టాల్లో నిలిచింది.

రోహిత్ ఔట్ అనంతరం వచ్చిన హిట్టర్ పొలార్డ్ (7) సిక్స్ కొట్టి ఊపు మీద కనిపించినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. హార్దిక్ పాండ్యా (10), కర్ణ్‌శర్మ (1) కూడా నిరాశపరచడంతో ముంబై తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. చివర్లో కృనాల్ పాండ్యా రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టడంతో ముంబై 129 పరుగులైనా చేయగలిగింది.

Mumbai Indians have won the toss and have opted to bat

పుణె బౌలర్ల ధాటికి ముంబై ఇండియన్స్ తొలి ఐదు ఓవర్లలో కనీసం ఒక బౌండరీ కూడా కొట్టలేదు. పూణె బౌలర్లలో జయ్‌దేవ్ ఉనాద్కత్, ఆడమ్ జంపా, డానియేల్ క్రిస్టియన్ తలో రెండు వికెట్లు తీయగా రెండు రనౌట్లు ఉన్నాయి.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

క్రికెట్‌ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్‌ తుదిపోరు ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్, రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ జట్లు తలపడుతున్నాయి.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంంది. దీంతో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ మొదటిగా బౌలింగ్ చేయనుంది. టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన పుణె జట్టు టైటిల్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఈ సీజన్‌లో లీగ్‌ దశలో రెండు సార్లు.. ప్లేఆఫ్‌లో ఒకసారి ఓటమి పాలైన ముంబై తుది పోరులో పూణెను ఓడించి మొత్తం లెక్కను ఒకేసారి సరి చేయాలని భావిస్తోంది.

హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి
నగరంలో ఐపీఎల్‌ సందడి నెలకొంది. ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ తుదిపోరు జరగనుంది. ఈ పోరులో ముంబై ఇండియన్స్‌తో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ తలపడనుంది. దాంతో ఉప్పల్‌ స్టేడియానికి అభిమానులు పోటెత్తుతున్నారు.

 IPL 2017: Final (Match 60): Mumbai Indians have won the toss and have opted to bat

జట్ల వివరాలు:


రైజింగ్ పుణె సూపర్‌జెయింట్:

అజింక్య రహానె, రాహుల్ త్రిపాఠి, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మనోజ్ తివారి, ధోనీ(వికెట్ కీపర్), డానియేల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, ఫెర్గుసన్, శార్దూల్ ఠాకూర్, జయ్‌దేవ్ ఉనడ్కట్, ఆడమ్ జంపా.

ముంబై ఇండియన్స్:

లెండిల్ సిమ్మన్స్, పార్థీవ్ పటేల్(వికెట్ కీపర్), అంబటి రాయుడు, రోహిత్ శర్మ(కెప్టెన్), క్రునాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, హార్ధిక్ పాండ్యా, కరణ్ శర్మ, మిచెల్ జాన్సన్, జాస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+