Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 207: వేలం తర్వాత కింగ్స్ పంజాబ్ జట్టు ఇదే

హైదరాబాద్: బెంగుళూరులో సోమవారం మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ ఎడిషన్‌ వేలంలో మిగతా ప్రాంచైజీలతో పోలిస్తే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అత్యధికంగా రూ. 23.35 కోట్లతో బరిలో నిలిచింది. సోమవారం జరిగిన వేలంలో పంజాబ్ జట్టు 8 మంది క్రికెటర్లను కొనుగోలు చేసింది.

ఐపీఎల్ 10వ ఎడిషన్ కోసం మొత్తం 351 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఇందులో నుంచి 76 మంది ఆటగాళ్లను ఎనిమిది ప్రాంచైజీలు కోనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్ టీ20 ఫార్మెట్ కావడంతో టీ20లో స్పెషలిస్ట్‌లుగా ముద్ర పడిన ఆటగాళ్లు వేలంగా మంచి ధర పలికారు.

ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక ధర పలికాడు. అతడిని పూణె రైజింగ్ జెయింట్స్ రూ. 14.5కోట్లకు దక్కించుకుంది. అతడి తర్వాత ఇంగ్లాండ్‌కు చెందిన తైమాల్ మిల్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు రూ. 12 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

IPL 2017: Final list of Kings XI Punjab (KXIP) squad after Players Auction

మరోవైపు ఇంగ్లాండ్ ఆటగాడు ఇయాన్‌ మోర్గాన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ దక్కించుకుంది. అతడి కనీస ధర రూ.2 కోట్లకే మోర్గాన్‌ను పంజాబ్‌ కొనుగోలు చేయడం విశేషం. సోమవారం వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అత్యధికంగా రూ. 3 కోట్లు వెచ్చించి తమిళనాడుకు చెందిన తంగరాసు నజరాజన్‌ను కొనుగోలు చేసింది.

వేలం అనంతరం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు:

జట్టులో మొత్తం ఆటగాళ్లు - 27, విదేశీ ఆటగాళ్లు - 9, మిగిలిన సొమ్ము - రూ. 13.9 కోట్లు

1. డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా)
2. గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)
3. షాన్ మార్ష్ (ఆస్ట్రేలియా)
4. మార్కస్ స్టోనిస్ (ఆస్ట్రేలియా)
5. హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా)
6. మనం వోరా
7. అక్షర్ రాజేష్ పటేల్
8. గురు కీర్త్ మన్ సింగ్
9. అనురీత్ సింగ్
10. సందీప్ శర్మ
11. శ్రద్దుల్ నరేంద్ర ఠాకూర్
12. వృద్ధిమాన్ సాహా
13. మురళి విజయ్
14. నిఖిల్ శంకర్ నాయక్
15. మోహిత్ శర్మ
16. కెసి కరియప్ప
17. అర్మాన్ జాఫర్
18. పర్దీప్ సాహు
19. స్వప్నిల్ సింగ్

పైన పేర్కొన్న ఆటగాళ్ల అందరూ వేలానికి ముందు పంజాబ్ ప్రాంఛైజీ వద్ద ఉన్నారు


సోమవారం వేలం పాటంలో పంజాబ్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే:

20. తంగరాసు నటరాజన్ - రూ .3 కోట్లు
21. వరుణ్ ఆరోన్ - 2.8 కోట్ల
22. రాహుల్ తెవాతియాతో - రూ. 25 లక్షలు
23. రింకు సింగ్ - రూ. 10 లక్షలు
24. ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్) - రూ .2 కోట్లు
25 మాట్ హెన్రీ (న్యూజిలాండ్) - రూ .50 లక్షలు
26. బ్రేస్వెల్ (న్యూజిలాండ్) - రూ .50 లక్షలు
27. డారెన్ సమీ (వెస్టిండిస్) - రూ .30 లక్షలు

గమనిక: ఐపీఎల్ రూల్స్ ప్రాకరం ఒక ప్రాంఛైజీ 27 మంది ఆటగాళ్లను కలిగి ఉండొచ్చు. అందులో విదేశీ ఆటగాళ్లు 9 మంది మాత్రమే ఉండాలి.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+