Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2017 వేలం: విదేశీయులకు కోట్లు, స్వదేశీయులకు లక్షలు

హైదరాబాద్: బెంగళూరులో ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం ముగిసింది. ఐపీఎల్ టీ20 ఫార్మెట్ కావడంతో టీ20లో స్పెషలిస్ట్‌లుగా ముద్ర పడిన ఆటగాళ్లు వేలంగా మంచి ధర పలికారు. అయితే వేలం ప్రక్రియ ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూసిన దేశీయ యువ క్రికెటర్లకు మాత్రం నిరాశే ఎదురైంది.

ముఖ్యంగా దేశవాళీ టోర్నీల్లో ఆకట్టుకున్న యువ ఆటగాళ్లకు ప్రాంఛైజీలు వేలంలో మొండిచెయ్యి చూపించాయి. టీమిండియాలో ఆడిన అనుభవం ఉన్న ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్ లాంటి ఆటగాళ్లను సైతం ప్రాంఛైజీలు కొనుగోలు చేయకపోడవం విశేషం. నిజానికి దేశవాళీ క్రికెటర్లలో ఉన్న ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో 2008లో ఈ లీగ్‌ను ప్రారంభించారు.

ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లతో ఆడటం వల్ల దేశీయ ఆటగాళ్లు తమ నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవడంతో పాటు డ్రెస్సింగ్‌ రూమ్‌లో వారి అనుభవాన్ని పంచుకోవడం, గేమ్‌ప్లాన్‌లను నేర్చుకునేందుకు వీలుండేది. ఐపీఎల్ ప్రారంభమైన తొలినాళ్లలో లీగ్‌లో ఆడే విదేశీ ఆటగాళ్ల సంఖ్య తక్కువగా ఉండేది.

అయితే రాను రాను ఈ సంఖ్య మరింతగా పెరుగతూ వచ్చింది. తాజాగా ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కో జట్టులో 9 మంది విదేశీ ఆటగాళ్లను కలిగి ఉండొచ్చు. జట్టులోని మొత్తం ఆటగాళ్ల సంఖ్య 27. ఇక తుది జట్టులో నలుగురికి మించి విదేశీ ఆటగాళ్లను ఆడించడానికి కూడా అవకాశం లేదు.

అయితే తాజాగా సోమవారం జరిగిన వేలంలో టీ20 స్పెషలిస్ట్ క్రికెటర్లకు ప్రాంఛైజీలు కోట్లు కుమ్మరించి దేశీయ ఆటగాళ్లకు మాత్రం మొండిచెయ్యి చూపించారు. ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక ధర పలికాడు. అతడిని పూణె రైజింగ్ జెయింట్స్ రూ. 14.5కోట్లకు దక్కించుకుంది.

అతడి తర్వాత ఇంగ్లాండ్‌కు చెందిన తైమాల్ మిల్స్‌ను రూ. 12 కోట్లు పెట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్రాంఛైజీ కొనుగోలు చేసింది. వీరిద్దరు కూడా విదేశీ క్రికెటర్లు కావడం విశేషం. మొత్తం 351 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా సోమవారం ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి 66 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరిలో 27 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

భారత్‌ నుంచి అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు (రూపాయల్లో)

భారత్‌ నుంచి అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు (రూపాయల్లో)

అంకిత్‌ చౌదరి (2 కోట్లు)- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

పవన్‌ నేగి (రూ. కోటి)- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

టీ నటరాజన్‌ (3 కోట్లు)- కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌

కర్ణ్‌ శర్మ (3.20 కోట్లు)- ముంబై ఇండియన్స్

కృష్ణప్ప గౌతమ్‌ (2 కోట్లు)- ముంబై ఇండియన్స్

మహ్మద్‌ సిరాజ్‌ (2.60 కోట్లు)- సన్ రైజర్స్ హైదరాబాద్‌

ఏకలవ్య ద్వివేది (75 లక్షలు)- సన్ రైజర్స్ హైదరాబాద్‌

మనోజ్‌ తివారీ (50 లక్షలు)- పుణె సూపర్ జెయింట్స్

బసీల్‌ తంపీ (85 లక్షలు)- గుజరాత్‌ లయన్స్

మన్‌ప్రీత్‌ గోనీ (60 లక్షలు)- గుజరాత్‌ లయన్స్

నాథూసింగ్‌ (50 లక్షలు)- గుజరాత్‌ లయన్స్

ఫ్రాంఛైజీలు అట్టి పెట్టుకున్న క్రికెటర్లు వీరే

ఫ్రాంఛైజీలు అట్టి పెట్టుకున్న క్రికెటర్లు వీరే

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

విరాట్‌ కోహ్లి (రూ. 12.5 కోట్లు)

ఏబీ డివిలియర్స్‌ (రూ. 9.50 కోట్లు)

షేన్‌ వాట్సన్‌(రూ. 9.5 కోట్లు)

క్రిస్‌ గేల్‌ (రూ. 7.5 కోట్లు)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

శిఖర్‌ధావన్‌ (రూ. 12.50 కోట్లు)

యువరాజ్‌సింగ్‌ (రూ.7 కోట్లు)

డేవిడ్‌ వార్నర్‌ (రూ. 5.50 కోట్లు)

ఆశీష్‌ నెహ్రా (రూ. 5.50 కోట్లు)

భువనేశ్వర్‌ కుమార్‌ (రూ. 4.25 కోట్లు)

దీపక్‌ హుడా ( రూ.4.20 కోట్లు)

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

గౌతమ్‌ గంభీర్‌ (రూ. 12.5 కోట్లు)

సునీల్‌ నరైన్‌ (రూ.9.50 కోట్లు)

రాబిన్‌ ఉతప్ప (రూ. 5 కోట్లు)

పియూశ్‌ చావ్లా (రూ. 4.25 కోట్లు)

ముంబై ఇండియన్స్‌

ముంబై ఇండియన్స్‌

రోహిత్‌ శర్మ (రూ.12.5 కోట్లు)

పోలార్డ్‌ (రూ. 9.50 కోట్లు)

లసిత్‌ మలింగ (రూ. 7.50 కోట్లు)

హర్భజన్‌సింగ్‌ (రూ.5.50 కోట్లు)

అంబటిరాయుడు (రూ. 4 కోట్లు)

రైజింగ్‌ పుణె సూపర్‌ జైయింట్స్‌

రైజింగ్‌ పుణె సూపర్‌ జైయింట్స్‌

ఎమ్‌ఎస్‌ ధోని (రూ. 12.50 కోట్లు)

అజింక్య రహానె (రూ. 9.50 కోట్లు)

రవిచంద్రన్ అశ్విన్‌( రూ. 7.50 కోట్లు)

స్టీవెన్‌ స్మిత్‌ (రూ. 5.50 కోట్లు)

గుజరాత్‌ లయన్స్‌

గుజరాత్‌ లయన్స్‌

సురేశ్‌రైనా (రూ.12.50 కోట్లు)

రవీంద్రజడేజా (రూ.9.50 కోట్లు)

జేమ్స్‌ ఫాల్క్‌నర్‌ (రూ.7.50 కోట్లు)

బ్రెండన్‌ మెక్‌కలమ్‌ (రూ.5.50 కోట్లు)

డ్వేన్‌ బ్రావో (రూ.4 కోట్లు)

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌

డేవిడ్‌ మిల్లర్‌ (రూ.12.50 కోట్లు)

మోహిత్‌ శర్మ (రూ. 6.50 కోట్లు)

మాక్స్‌వెల్‌ (రూ.6 కోట్లు)

మనన్‌వోహ్రా (రూ.4 కోట్లు)

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌

క్రిస్‌ మోరీస్‌ (రూ. 7 కోట్లు)

మహ్మద్‌ షమీ (రూ.4.25 కోట్లు)

సంజు శాంసన్‌ (రూ. 4.20 కోట్లు)

బ్రాత్‌వైట్‌ (రూ 4.20 కోట్లు)

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+