Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పూణె ఫీల్డింగ్ అదుర్స్: సిమన్స్ రిటర్న్ క్యాచ్ ఉనాద్కత్ పట్టాడిలా (వీడియో)

హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో రైజింగ్ పూణె తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో ప్రేక్షుకులను మంత్రి ముగ్దుల్ని చేశారు. ముంబై ఇండియన్స్ ఇచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని పూణె ఫీల్డర్లు వదల్లేదు. ముంబై ఓపెనర్ సిమన్స్‌ను రిటర్న్ క్యాచ్ రూపంలో ఉనాద్కత్ అందుకున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

బంతి కింది పడబోయే సమయంలో ఉనాద్కత్ మెరుపు వేగంతో ఒడిసి పట్టుకుని 'ఫర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద మ్యాచ్' అనిపించేలా చేశాడు. ఆ తర్వాత అంబటి రాయుడిని స్టీవ్ స్మిత్ రనౌట్ చేసిన తీరు అద్భుతం. ఈ రెండు ఒక ఎత్తయితే ఆడమ్ జంపా బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద శార్దూల్ ఠాకూర్ అందుకున్న వైనం మ్యాచ్‌కే హైలెట్.

ఆ తర్వాత కరణ్ శర్మను శార్దూల్ ఠాకూర్ రనౌట్ చేసిన తీరు ఆకట్టుకుంది. కర్ణ్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను తొలుత క్రిస్టియాన్ వదిలేశాడు. దీంతో, అప్పటికే కర్ణ్ శర్మ క్రీజును వదిలేసి ముందుకు వెళ్లి పోయాడు. ఈ సమయంలో బౌలర్ శార్దూల్ ఠాకూర్.. క్రిస్టియాన్ విసిరిన బంతిని చాకచక్యంగా అందుకుని రనౌట్ చేశాడు.

ఇలా ఇద్దరు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేర్చారు. కాగా, హైదరాబాద్‌ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న పైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ పూణెకు 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఫైనల్ మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ తీవ్ర నిరాశపరిచారు.

Jaydev Unadkat's brilliant return catch to removeLendl Simmons is a must watch

ముంబై టాప్ ఆర్డర్ విఫలం కావడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పార్ధీవ్ పటేల్(4), సిమన్స్(3) లు తీవ్రంగా నిరాశపరిచారు. ఈ ఇద్దరూ జట్టు స్కోరు ఎనిమిది పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరారు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు, రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరూ 33 పరుగుల్ని జత చేసిన తరువాత రాయుడు(12) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో రోహిత్ శర్మ కూడా అవుట్ కావడంతో ముంబైకి కోలుకోలేని దెబ్బ తగిలింది.

Jaydev Unadkat's brilliant return catch to removeLendl Simmons is a must watch

చివర్లో కృనాల్ పాండ్యా 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులతో రాణించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. పూణె బౌలర్లలో ఉనాద్కత్, ఆడమ్ జంపా, క్రిస్టియన్‌లు తలో రెండు వికెట్లు తీశారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+