ఐపీఎల్: రైనా అభిమాని అత్యుత్సాహం, కాసేపు నిలిచిన మ్యాచ్
హైదరాబాద్: భారత్‌లో క్రికెట్‌ను ఓ మతంలా భావిస్తారు. ఇక క్రికెటర్లను అయితే ఎంతలా ఆరాధిస్తారో చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో ఆడుతున్న తమ అభిమాన క్రికెటర్‌ని కలిసేందుకు భద్రతా సిబ్బందిని దాటుకుని మరీ కలిసిన సందర్భాలు అనేకం.
క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనిల కాళ్లకు అభిమానులు దండం పెట్టిన సంఘటనలు గతంలో ఎన్నో చూశాం. ఇలాంటి సంఘటనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో బుధవారం కాన్పూర్ వేదికగా గుజరాత్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కనిపించింది.
గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనాను కలిసేందుకు రింకూ అనే అభిమాని భద్రతా సిబ్బందిని దాటుకుని మైదానంలోకి దూసుకొచ్చాడు. అతడి రాకను గమనించిన భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే సురేశ్ రైనాతో కరచాలనం చేశాడు. అయితే ఆ తర్వాత రైనా కోరిక మేరకు అతడు మైదానం వీడాడు.

మ్యాచ్‌కు కాసేపు అంతరాయం
ఈ సమయంలో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. ఢిల్లీ యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను తన అద్భుతమైన ఆటతీరుతో రనౌట్ చేసిన తీరుపై రైనాను అభినందించేందుకు తాను మైదానంలోకి వెళ్లినట్లు మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రింకూ చెప్పాడు.

గతంలో కూడా ఇలా చేశా
గతంలో ఓ రంజీ మ్యాచ్ సందర్భంలో తన అభిమాన క్రికెటర్‌ను కలిశానని అతడు తెలిపాడు. ఇదిలా ఉంటే బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 2 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

గుజరాత్‌పై ఢిల్లీ విజయం
అరోన్ ఫించ్ (39 బంతుల్లో 69; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) దినేశ్ కార్తీక్ (28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆ తర్వాత 196 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 197 పరుగులు చేసి గుజరాత్‌పై విజయం సాధించింది.

శ్రేయస్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు
ఢిల్లీ యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 96; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించి ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కమిన్స్ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో శ్రేయస్ అయ్యర్‌కు మద్దతుగా నిలిచాడు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శ్రేయస్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications