Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోని భార్యకు ఏమైంది?: కావాలనే ట్విట్టర్‌లో ఆ పోస్ట్ పెట్టిందా!

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి రావత్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. రెండు రోజుల క్రితం ఐపీఎల్‌లో రెండేళ్ల పాటు సస్పెన్షన్‌కు గురైన చెన్నై సూపర్ కింగ్స్‌ లోగో ఉన్న హెల్మెట్ పెట్టుకుని దిగిన సెల్ఫీని సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది.

అంతేకాదు... ఈ ఫొటో కింద పక్షులు బతికున్నప్పుడు చీమలను తింటాయ‌ని, అయితే పక్షి చనిపోయిన తర్వాతే చీమలు దాన్ని తింటాయని ఆమె ఓ పోస్టు చేసింది. టైంతో పాటు ప‌రిస్థితులు మారిపోతూ ఉంటాయ‌ని, ఎవరినీ తక్కువ చేసేలా లేదా అవమానించేలా ప్రవర్తించవద్దని ఆమె పేర్కొంది.

పది లక్షల చెట్లను కాల్చడానికి ఓ అగ్గిపుల్ల చాలు

పది లక్షల చెట్లను కాల్చడానికి ఓ అగ్గిపుల్ల చాలు

'ఈ రోజు నీవు బలవంతుడు కావచ్చు కానీ, నీ కంటే స‌మ‌యం ఎంతో బలమైనదని గుర్తు పెట్టుకో' అని ఆమె పేర్కొంది. ఓ చెట్టు పదిలక్షల అగ్గిపుల్లలను అందిస్తుందని, అయితే పది లక్షల చెట్లను కాల్చడానికి ఓ అగ్గిపుల్ల చాలని భారీ డైలాగుల‌ని వ‌దిలింది. కాబట్టి మంచిగా ఉండాల‌ని, మంచి చేయాల‌ని ఆమె పేర్కొంది.

పుణె యాజమాన్యంపై ప్రతీకారం తీర్చుకొంటుందా!

పుణె యాజమాన్యంపై ప్రతీకారం తీర్చుకొంటుందా!

తన భర్త ధోనీని అవమానించిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌ యాజమాన్యంపై ప్రతీకారం తీర్చుకునేందుకు సాక్షి ఈ వ్యాఖ్యలు చేసిందా? అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్‌గా ధోనీ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.

రెండేళ్ల పాటు సస్పెండ్

రెండేళ్ల పాటు సస్పెండ్

అయితే, ఆ జట్టు అధికారులపై బెట్టింగ్ ఆరోపణలు రావడంతో ఐపీఎల్‌ నుంచి ఈ జట్టును రెండేళ్ల పాటు సస్పెండ్ చేశారు. ప్ర‌స్తుతం ధోనీ పూణె త‌ర‌ఫున ఆడుతున్నాడు. అయితే, ఈ సీజన్‌లో పుణె యాజమాన్యం ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించి అతడి స్ధానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.

ధోనిపై హర్ష్ గోయెంకా అనుచిత వ్యాఖ్యలు

ధోనిపై హర్ష్ గోయెంకా అనుచిత వ్యాఖ్యలు

అయితే ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభమైన తర్వాత పూణె టీమ్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా సోదరుడు హర్ష్ గోయెంకా ధోనీపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ధోనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ధోనీ భార్య సాక్షి సోషల్ మీడియాలో చేసిన పోస్టులు కలకలం రేపుతున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+