For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ దిద్దుబాటు చర్య: నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి!

ఐపీఎల్ పదో సీజన్‌లో ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఘోర పరాజయం చవిచూసింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో జట్టులో లోపాలపై దృష్టి సారించిన మేనేజ్‌మెంట్ చివరిగా ఒక తప్పిదాన్ని కనిపెట్టి దిద్దుబాటు చర్యలకు దిగింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన డికాక్ స్థానంలో శ్యామ్యూల్స్‌ని జట్టులోకి తీసుకుంది.

ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాప్ ఆర్డర్‌లో అనుభవం లేని బ్యాట్స్‌మెన్ లేకపోవడం వల్లే ఓడిపోతున్నామని గుర్తించిన ఢిల్లీ ప్రాంఛైజీ వెంటనే వెస్టిండీస్ ఆల్‌రౌండర్ మార్లోన్ శ్యామూల్స్‌ని జట్టులోకి తీసుకుంది. మార్లిన్ శామ్యూల్స్ వెస్టిండిస్ తరుపున 71 టెస్టులు, 187 వన్డేలు, 55 టీ20లు ఆడాడు.

IPL 2017: DD sign Marlon Samuels as replacement for Quinton de Kock

టీ20ల్లో అపార అనుభవం ఉన్న శ్యామ్యూల్స్‌ని ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం విశేషం. ఐపీఎల్ వేలంలో శామ్యూల్స్ కనీస ధరను రూ. కోటిగా నిర్ణయించారు. 2012లో జరిగిన ఐపీఎల్ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లాడిన శామ్యూల్స్ 124 పరుగులు చేయడంతో పాటు ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు. చివరి సారిగా 2013లో పుణె వారియర్స్‌ తరఫున ఐపీఎల్‌ ఆడాడు.

ఆ తర్వాతి సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమైన శామ్యూల్స్ 5, 3 పరుగులతో నిరాశ పరిచాడు. గత సీజన్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్లు డికాక్, డుమిని టాప్ ఆర్డర్‌లో ఉండటంతో మెరుగైన ప్రదర్శన చేసిన ఢిల్లీ పదో సీజన్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నా.. బ్యాటింగ్‌లో తేలిపోతోంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+