Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తంపీ నీ షూ తీసుకో: పరుగు మధ్యలో వార్నర్ క్రీడా స్ఫూర్తి (వీడియో)

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ దూసుకుపోతుంది. వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై 35 పరుగుల తేడాతో నెగ్గిన హైదరాబాద్, రెండో మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ జట్టు రషీద్ ఖాన్ ధాటికి 135 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత 136 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శిఖర్ ధావన్ (9) వికెట్‌ను కోల్పోయింది. అనతంరం మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (45 బంతుల్లో 76), హెన్రిక్యూస్ (39 బంతుల్లో 52) అద్భుత బ్యాటింగ్‌తో మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది.

వార్నర్, హెన్రిక్యూస్‌ల జోడి అద్భుతంగా రాణించి గుజరాత్ బౌలర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. ఐపీఎల్ 10వ సీజన్‌తో అరంగేట్రం చేసిన గుజరాత్ లయన్స్ బౌలర్ బసిల్ థంపికి డేవిడ్ వార్నర్ మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ పదో ఓవర్లో ఈ బసిల్ తంపి విసిరిన బంతిని హెన్రిక్యూస్ లాంగాన్ మీదుగా ఆడాడు.

దాన్ని ఆపే క్రమంలో తంపి షూ ఊడి దూరంగా పడిపోగా.. అతడు కింద పడిపోయాడు. ఈ క్రమంలో నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి పరిగెడుతున్న వార్నర్ మధ్యలో ఆగి మరీ షూను తంపి చేతిలో పెట్టి పరుగు పూర్తి చేశాడు. ఆ సీన్ చూసి కామెంటేటర్లు వార్నర్ క్రీడా స్ఫూర్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

మైదానంలోని ప్రేక్షకులు, టీవీ చూస్తున్న అభిమానులు సైతం నవ్వుతూనే వార్నర్‌ను ప్రశంసించారు. ఇదిలా ఉంటే కేరళకు చెందిన తంపి ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్ బౌలింగ్ చేసి 21 పరుగులు ఇచ్చుకోగా, బ్యాటింగ్‌లో ఒక సిక్సర్ బాది 13 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+