
20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన డేవిడ్ వార్నర్ గంభీర్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం 173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ వార్నర్ ఈడెన్‌లో అభిమానుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

కుల్దీప్ వేసిన ఎనిమిదో ఓవర్‌ని ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డ వార్నర్
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్ కుల్దీప్ వేసిన ఎనిమిదో ఓవర్ ఎదుర్కొనేందుకు వార్నర్ తెగ ఇబ్బందిపడ్డాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా స్టేడియం గ్యాలరీలో ఉన్న అభిమానులందరూ తమ వద్ద ఉన్న ఫోన్లలోని ఫ్లాష్ లైట్‌ను ఆన్ చేసి తమ అభిమాన క్రికెటర్‌కు మద్దతు తెలపడం మనం చూస్తూనే ఉన్నాం.

ఫ్లాష్ లైట్లను ఆన్ చేసిన అభిమానులు
శనివారం నాటి మ్యాచ్‌లో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చేస్తుండగా అభిమానులందరూ ఫ్లాష్ లైట్లను ఆన్ చేశారు. ఫ్లాష్ లైట్ల వెలుగులో కుల్దీప్ వేసిన బంతులను ఎదుర్కునేందుకు వార్నర్ తెగ ఇబ్బంది పడ్డాడు.

అంఫైర్ వద్దకు వెళ్లి సమస్యను వివరించిన వార్నర్
దీంతో డేవిడ్ వార్నర్ నేరుగా అంఫైర్ వద్దకు వెళ్లి సమస్యను వివరించాడు. ఫ్లాష్ లైట్ల వెలుగులో కుల్దీప్ బంతిని అంచనా వేయలేకపోతున్నానని పేర్కొన్నాడు. దీంతో అంఫైర్ ఈ విషయాన్ని మూడో అంఫైర్‌కు నివేదించాడు. ఆ తర్వాత
కొద్దిసేపటికే డేవిడ్ వార్నర్ కుల్దీప్ బౌలింగ్‌లోనే అవుట్ కావడం విశేషం.


Click it and Unblock the Notifications