Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ఇక లేనట్లే!: షిర్కే మాటలతో అయోమయం

ముంబై: క్రికెట్‌లో సమూల ప్రక్షాళన కోసం ఏర్పాటైన లోధా కమిటీ సిఫారసుల అమలు చేయాల్సిందేనంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీసీసీఐ అత్యంత గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటొంది. ఇప్పటికే భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు ఖర్చులను భరించలేమని బీసీసీఐ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే.

భారత్‌లో పర్యటన ముగిసే వరకు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఖర్చులు భరించలేమని, మీవి మీరే చూసుకోవాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాసింది. అసౌకర్యానికి బోర్డు తరఫున క్షమాపణలు తెలుపుతున్నానని అన్నారు. హోటల్, ప్రయాణ ఖర్చులను మీ బోర్డే పెట్టుకోవాలని అందులో కోరారు.

భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు వచ్చిన ప్రమాదమేమీ లేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. 'మేం ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నాం. ఇప్పుడు మా ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదు. సిరీస్ కోసమే ఎదురుచూస్తున్నాం' అని ఈసీబీ అధికార ప్రతినిధి తెలిపారు.

Ajay Shirke

అయితే ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌కే పరిస్థితి ఇలా ఉంటే, వచ్చే ఏడాది అసలు ఐపీఎల్ జరుగుతుందా? లేదా అనేది పూర్తిగా అయోమయంలో ఉంది. ఐపీఎల్‌కు సంబంధించి పనులను ఇప్పటికే మొదలు పెట్టాల్సి ఉంది. అయితే లోధా కమిటీ సిఫారసుల అమలుపై బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ పనులు ఆగిపోయాయి.

తాజాగా జాతీయ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో శుక్రవారం బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే మాట్లాడారు. ఈ క్రమంలో అసలు వచ్చే ఏడాది ఐపీఎల్ జరుగుతుందా? లేదా? అనే విషయం తనకు తెలియదని చెప్పారు. దీంతో ఐపీఎల్ సందిగ్ధంలో పడింది.

'2017 ఐపీఎల్ డేంజర్‌లో ఉంది. అసలు జరుగుతుందా? లేదా? అనేది ఇంకా నాకైతే తెలీదు. ఐపీఎల్ గురించి లోధా కోరిన వివరాలను ఆ కమిటీకి తెలియజేశాం. ఐపీఎల్‌కి సంబంధించిన పని అయితే పెండింగ్‌లోనే ఉంది. సమయం కూడా లేదు. ఏం జరగుతుందో నాకు పూర్తిగా తెలీదు' అని షిర్కే పేర్కొన్నారు.

దాంతో పాటు బీసీసీఐ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితి చాలా దురదృష్టకరమని షిర్కే తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొవడంతో బీసీసీఐకి కూడా లోధా కమిటీ సిఫారసుల అమలు రూపంలో పెద్ద దెబ్బ తగిలింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+