మూడు ఫార్మెట్లకు కెప్టెన్‌గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ
ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మెట్లలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అయితే కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు పదో సీజన్‌లో చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. అంతేకాదు ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ చెత్త రికార్డుని కూడా సొంతం చేసుకుంది. ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 9.4 ఓవర్లలో 49 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ పరుగులకే అవుటైన జట్టుగా నిలిచింది.
ఇద్దరూ అత్యత్తుమ ప్రతిభ కలిగిన ఆటగాళ్లే
నిజానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ అత్యత్తుమ ప్రతిభ కలిగిన ఆటగాళ్లే. అయితే రోహిత్ శర్మ నిలకడలేమి కారణంగా టీమిండియా కెప్టెన్సీ విరాట్ కోహ్లీకి లభించిందనే చెప్పాలి. అంతేకాదు ఆటతీరులో కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మది క్లాస్ బ్యాటింగ్ అంటూ గతంలో పలువురు మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసలు కురిపించారు. ఒకానొక సందర్భంలో సచిన్ టెండూల్కర్ సైతం కోహ్లీని కాదని రోహిత్‌ని కొనియాడాడు.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై వరుస విజయాలు
రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ఇలా వరుస విజయాలను సొంతం చేసుకోవడం విరాట్ కోహ్లీకి ఇబ్బంది కలిగించే విషయమే. ఎందుకంటే ఏదో ఒకరోజు సెలక్టర్లు సైతం కోహ్లీని కాదని రోహిత్ శర్మవైపు మొగ్గుచూపిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వన్డేల్లే అత్యధిక స్కోరు చేసిన రికార్డు కూడా రోహిత్ శర్మదే.
కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మకు మెరుగైన రికార్డు
టీ20 ఫార్మెట్‌లో కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మకు మెరుగైన రికార్డు ఉంది. తాజాగా భారత ఆటగాళ్లలో అత్యధిక టీ20 టైటిళ్లను గెలిచిన రికార్డును రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు. ఆదివారం పూణైపై సాధించిన టైటిల్ రోహిత్ శర్మకు ముంబై తరుపున మూడోది కాగా, మొత్తంగా ఏడో టీ20 టైటిల్ కావడం విశేషం. రోహిత్ శర్మ ఆడిన భారత జట్టు వరల్ట్ టీ20 టైటిల్(2007), ఆసియా కప్ (2016), నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు (ముంబైతో మూడు, డెక్కన్ ఛార్జర్స్)లను గెలుచుకుంది.

కెప్టెన్సీపై రోహిత్ శర్మ ఇలా
ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వెబ్‌సైట్ రోహిత్ శర్మను అత్యంత సక్సెస్‌పుల్ భారత ఆటగాడిగా అభివర్ణించింది. ఐపీఎల్ టోర్నీ విజయానంతరం ఇదే ప్రశ్నను రోహిత్ శర్మను అడగ్గా ఇది మరీ ముందుకు ఆలోచించడమని, తాను అంత ముందుకు ఆలోచించనని చెప్పడం విశేషం. అయితే అవకాశం వచ్చినప్పుడే వస్తుందని, అప్పుడు మాత్రం తన రెండు చేతులతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటానని రోహిత్ శర్మ చెప్పాడు.


Click it and Unblock the Notifications











