ఐపీఎల్ 2017: వేలంలో అమ్ముడుపోని టాప్ 12 ఆటగాళ్లు వీరే
హైదరాబాద్: బెంగుళూరులో ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం ముగిసింది. మొత్తం 351 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా సోమవారం ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి 66 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరిలో 27 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక ధర పలికాడు. అతడిని పూణె రైజింగ్ జెయింట్స్ రూ. 14.5కోట్లకు దక్కించుకుంది. అంతకముందు యువరాజ్ సింగ్ అత్యధికంగా రూ. 16 కోట్లు పలికి ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
విదేశీ ఆటగాళ్లలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా బెన్ స్టోక్స్ గుర్తింపు పొందాడు. అతడి తర్వాత ఇంగ్లాండ్‌కు చెందిన తైమాల్ మిల్స్‌ను రూ. 12 కోట్లు పెట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్రాంఛైజీ కొనుగోలు చేసింది. సోమవారం జరిగిన వేలంలో భారత్‌కు చెందిన పలువురు క్రికెటర్లు అమ్ముడుపోలేదు.
టీమిండియాకు ప్రాతనిథ్యం వహించిన ఆటగాళ్లు ఛతేశ్వర్ పుజారా, ఇర్ఫాన్ పఠాన్, ఉన్ముక్త్ చంద్, అభినవ్ ముకుంద్, పర్వేజ్ రసూల్, పంకజ్ సింగ్, రాహుల్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజాతో సహా మరికొంత మంది ఆటగాళ్లు అమ్ముడుపోని జాబితాలో ఉన్నారు.
వీరితో పాటు న్యూజిలాండ్ క్రికెటర్లు రాస్ టేలర్, మార్టిన్ గఫ్తిల్, ఇంగ్లండ్ ఆటగాళ్లు జాసన్ రాయ్‌లకు ఆశాభంగం తప్పలేదు. బ్రాడ్ హాగ్ (ఆస్ట్రేలియా), ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), ఆండ్రూ ఫ్లెచర్ (వెస్టిండీస్)లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచేజీలు ఆసక్తి చూపక పోవడం విశేషం.
ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని టాప్ 12 ప్లేయర్లు వీరే:

ఇషాంత్ శర్మ
వేలంలో టీమిండియా సీనియర్ ఆటగాడు కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించారు. తొలి సెషన్‌లో ఆసక్తి కనబరచని ప్రాంచైజీలు రెండో సెషన్‌లో కూడా ఆసక్తి కనబరచలేదు. గత సీజన్‌లో ఇషాంత్ శర్మ రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్‌కు ఆడాడు.

ఇర్ఫాన్ పఠాన్
ఐపీఎల్ 2017 వేలంలో ఇర్ఫాన్ పఠాన్ ప్రాంఛైజీలను ఆకట్టుకోలేక పోయాడు. పఠాన్ కనీస ధరను రూ. 50 లక్షలుగా నిర్ణయించారు. అయినప్పటికీ ఏ ఒక్క ప్రాంఛైజీకి కూడా కోనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరచలేదు. గత సీజన్‌లో పఠాన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడాడు.

ఇమ్రాన్ తాహిర్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోలేదు. ఇమ్రాన్ తాహిర్ పేరుని రెండు సార్లు ఐపీఎల్ వేలంలో ప్రకటించినా అతడిని కొనుగోలు చేసేందుకు ప్రాంఛైజీలు ఆసక్తిని కనబరచలేదు.

తిషారా పెరారా
ఐపీఎల్ 2017 వేలంలో తిషారా పెరారా ప్రాంఛైజీలను ఆకట్టుకోలేక పోయాడు. అయినప్పటికీ ఏ ఒక్క ప్రాంఛైజీకి కూడా కోనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరచలేదు. గత సీజన్‌లో తిషారా పెరారా రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ ఆడాడు.

జానీ బెయిర్ స్టో
ఐపీఎల్ 2017 వేలంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో ప్రాంచైజీలను ఆకట్టుకోలేకపోయాడు. బెయిర్ స్టో కనీస ధరను రూ. 1.50 కోట్లు నిర్ణయించారు. అయినప్పటికీ ఏ ఒక్క ప్రాంఛైజీకి కూడా కోనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరచలేదు.

బ్రాడ్ హాగ్
ఐపీఎల్ 2017 వేలంలో 45 ఏళ్ల బ్రాడ్ హాగ్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క ప్రాంఛైజీ కూడా ముందుకు రాలేదు. బ్రాడ్ హాగ్ కనీస ధరను రూ. 50 లక్షలు నిర్ణయించారు. గతేడాది బ్రాడ్ హాగ్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయినప్పటికీ ఏ ఒక్క ప్రాంఛైజీకి కూడా కోనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరచలేదు.

పర్వేజ్ రసూల్
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పర్వేజ్ రసూల్‌ను ఐపీఎల్ 2017 వేలంలో ఏ ఒక్క ప్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు ఆడిన పర్వేజ్ రసూల్ కనీస ధరను రూ. 30 లక్షలుగా నిర్ణయించారు.

మొహమ్మద్ షహ్జాద్
మొహమ్మద్ షహ్జాద్ కనీస ధరను రూ. 50 లక్షలుగా నిర్ణయించారు. అయినప్పటికీ ఐపీఎల్ 2017 వేలంలో ఏ ఒక్క ప్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు.

ఛటేశ్వర్ పూజారా
ఐపీఎల్ 2017 వేలంలో ఛటేశ్వర్ పూజారాను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క ప్రాంఛైజీ కూడా ముందుకు రాలేదు. ఛటేశ్వర్ పూజారా కనీస ధరను రూ. 50 లక్షలుగా నిర్ణయించారు. అయినప్పటికీ ఐపీఎల్ 2017 వేలంలో ఏ ఒక్క ప్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు.

మార్లిన్ శామ్యూల్స్
గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్న వెస్టిండిస్ వెటరన్ క్రికెటర్ మార్లిన్ శామ్యూల్స్‌ను ఏ ఒక్క ప్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. మార్లిన్ శామ్యూల్స్ కనీస ధరను రూ.కోటిగా నిర్ణయించారు.

ప్రజ్ఞాన్ ఓజా
ప్రజ్ఞాన్ ఓజాకు ఇది నిజంగా నిరాశే. కనీస ధరను రూ. 30 లక్షలుగా నిర్ణయించినా, ఏ ఒక్క ప్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. గత సీజన్లలో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా నిలిచిన ఓజాపై ప్రాంఛైజీలు ఆసక్తి కనబర్చకపోవడంతో నిరాశకు గురయ్యాడు.

అలెక్స్ హాల్స్
ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ అలెక్స్ హాల్స్‌కు ప్రాంఛైజీలు మొండిచెయ్యి చూపించాయి. అలెక్స్ హాల్స్ కనీస ధరను రూ. కోటిగా నిర్ణయించారు. అయినప్పటికీ ఏ ఒక్క ప్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications