Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ వేలం: రూ. 2 కోట్ల క్లబ్‌లో ఇషాంత్, బెన్ స్టోక్స్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 20న జరిగే వేలంలో 799 మంది పోటీ పడనుండగా, వీరిలో 76 మందికి ఐపీఎల్‌లో ఆడే అవకాశం లభించనుంది. టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ రూ. 2 కోట్ల కనీస ధరతో ఐపీఎల్ పదో సీజన్ వేలానికి రానున్నాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆటగాడి అత్యధిక కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించారు. దీంతో ఇషాంత్ శర్మతో పాటు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో పాటు కూడా అత్యధిక ధర జాబితాలో చోటు దక్కించుకున్నాడు. వీరితో పాటు ఆసీస్ బౌలర్లు మిచెల్ జాన్సన్, పాట్‌ కమిన్స్‌, ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్లు బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌లు ఈ జాబితాలో ఉన్నారు.

IPL 2017 Auction: Rs 2 crore base price for Ben Stokes, 6 others

మరోవైపు శ్రీలంక కెప్టెన్‌ ఏంజెలో మాథ్యూస్‌ కూడా రూ. 2 కోట్ల క్లబ్‌ లో స్థానం సంపాదించుకున్నారు. ఇక ఇంగ్లండ్‌కు చెందిన బెయిర్ స్టో, న్యూజిలాండ్‌కు చెందిన బౌల్ట్, ఆస్ట్రేలియాకు చెందిన లియాన్, హడిన్, దక్షిణాఫ్రికాకు చెందిన కైల్ అబాట్, వెస్టిండీస్‌కు చెందిన జేసన్ హోల్డర్‌ను రూ. 1.5 కోట్ల కనీస ధర పలకనున్నారు.

IPL 2017 Auction: Rs 2 crore base price for Ben Stokes, 6 others

ఈ నెల 20న జరిగే వేలంలో మొత్తం 8 దేశాలకు చెందిన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఒక్క భారత్ నుంచే 639 ఆటగాళ్లు వేలంలో అందుబాటులో ఉండగా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండిస్, శ్రీలంకు చెందిన ఆటగాళ్లు కూడా ఉండటం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+