
అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆండ్రూ టై అద్భుత బౌలింగ్
అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆండ్రూ టై అద్భుత బౌలింగ్‌తో ఐపీఎల్ రికార్డులు బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో అరంగేట్రంలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. 2008లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున బరిలో దిగిన అక్తర్ ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై 4 వికెట్లు తీశాడు.

అక్తర్ రికార్డుని బద్దలు కొట్టిన ఆండ్రూ టై
ఇప్పటి వరకూ ఇదే రికార్డు. అయితే శుక్రవారం ఆస్ట్రేలియన్ పేసర్ ఆండ్రూ టై ఆ రికార్డుని అధిగమించాడు. 2016 ప్రారంభంలో భారత్‌పైనే టీ20ల్లో అరంగేట్రం చేసిన ఆండ్రూ టై ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడి ఐదు వికెట్లు తీసుకోగా, ఐపీఎల్‌లో ఆడిన ఒక్క మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీయడం విశేషం.

20వ ఓవర్లో హ్యాట్రిక్
నిజానికి పూణెతో జరిగిన మ్యాచ్‌లో 20వ ఓవర్లో హ్యాట్రిక్ సాధించిన ఆండ్రూ టై (5/17)కి అదే ఓవర్లో మరో వికెట్ దక్కేది. రాహుల్ చాహర్ ఇచ్చిన క్యాచ్‌ను రవీంద్ర జడేజా వదిలేశాడు. ఆ క్యాచ్‌ని గనుక పట్టుకొని ఉంటే.. ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన సోహైల్ తన్వీర్ (6/14), ఆడమ్ జంపా (6/19) సరసన ఆండ్రూ టై చేరేవాడు.

ఆండ్రూ టైతో సహా 14 మంది బౌలర్లు
ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆండ్రూ టైతో సహా 14 మంది బౌలర్లు ఐదు వికెట్లు తీసిన వారి జాబితాలో ఉన్నారు. రవీంద్ర జడేజా కూడా ఈ జాబితాలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలో దిగిన జడేజా.. విశాఖపట్నం వేదికగా డెక్కన్ ఛార్జర్స్‌తో 2012లో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు.


Click it and Unblock the Notifications











