అమీ జాక్సన్ డ్యాన్స్ నచ్చలేదు!: ఉప్పల్‌లో యువీ భార్య హాజల్ హల్‌చల్
హైదరాబాద్: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. బాలీవుడ్ నటి అమీ జాక్సన్ ఆరంభ వేడుకల్లో డ్యాన్స్‌తో అలరించారు. అయితే, ఇప్పుడు ఆమె ప్రదర్శనపై సోషల్ మీడియాల్లో పెద్ద చర్చ జరుగుతోంది.

అభిమానులకు నచ్చలేదు
అభిమానులకు అమీ జాక్సన్ నృత్య ప్రదర్శన నచ్చలేదంట. మిరుమిట్లు గొలిపే విద్యుత్తు వెలుగుల్లో ఓపెన్ టాప్ వాహనంలో మైదానంలో అడుగుపెట్టిన అమీ జాక్సన్ తన డ్యాన్సుతో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. కాలాచష్మా, ఓం శాంతి ఓం పాటలకు ఆమె డ్యాన్స్ చేసింది.

అమీ జాక్సన్ పైన విమర్శలు
దీంతో నెటిజన్లు ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఫ్లాప్ అయ్యాయని పేర్కొన్నారు. అంతేకాదు అమీ జాక్సన్ కంటే సన్ని దేవోల్ బాగా డ్యాన్స్ చేసేవారన్నారు.

అమీ జాక్సన్ డ్యాన్స్ నచ్చలేదు
అమీ జాక్సన్ డ్యాన్స్ చేసిన తీరు గురించి చెప్పాలనుకుంటున్నా... కానీ చెప్పలేను, ఎంతోమంది సెలబ్రెటీల మధ్య అమీ జాక్సన్ చేసిన డ్యాన్స్ తేలిపోయిందని, ఈ తరహా డ్యాన్స్ చేయడంతో ఐపీఎల్ కంటే అమీనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుందని ఓ నెటీజన్ ట్వీట్ చేశారు.

ఉప్పల్ స్టేడియంలో విక్టరీ వెంకటేష్ హంగామా
క్రికెట్ అంటే నటుడు వెంకటేష్‌కు ఇష్టం. క్రికెట్ మ్యాచులు చూసేందుకు వెళ్లడం ఆయనకు అలవాటు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచుకు హాజరై.. సన్ రైజర్స్ హైదరాబాద్ పతాకాన్ని ఎగరవేస్తున్న వెంకటేష్.

సాయి ధరమ్ తేజతో
ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచుకు హాజరైన నటుడు సాయి ధరమ్ తేజతో ఓ నటి.
ఐపీఎల్10వ సీజన్‌లో
తలపడిన తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేవు. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై 35పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఆకట్టుకున్నాడు. మ్యాచ్ వీక్షించేందుకు ఆయన సతీమణి హాజల్ కీచ్ వచ్చారు. యువీ బంతిని బాదినప్పుడు ఆమె నవ్వుతూ, చప్పట్లు చరుస్తూ, విక్టరీ గుర్తు చూపిస్తూ కనిపించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications